Thangalaan:- వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు చియాన్ విక్రమ్. జయాపజయాలతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ నచ్చితే సినిమా చేయటానికి విక్రమ్ ఆలోచించరు. రిస్క్ తీసుకుని ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయటానికి చియాన్ రెడీ అయిపోతారు. అందుకు చాలా ఉదాహరణలను మనం సినిమాల రూపంలో చూశాం. అలాగే ఆయన నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విక్రమ్ పక్కా మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా తంగలాన్ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో విక్రమ్ లుక్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆయనపై అప్రిషియేషన్స్ కురిపిస్తున్నారు. సోమవారం (ఏప్రిల్ 17)న విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. గుబురు గడ్డం హెయిర్ స్టైల్, తన వేషధారణ అన్ని డిఫరెంట్‌గా ఉన్నాయి.
కోలారు బంగారు గనుల్లోని కార్మికుల జీవితాలపై తంగలాన్ సినిమాను దర్శకు పా రంజిత్ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన మేకింగ్ వీడియోతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళ, ఒడియా, బెంగాలీ, మరాఠీ భాషల్లో విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పార్వతీ, మాళవికా మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో విక్రమ్ తనేంటో మరోసారి ఇండియన్ సినిమాకు ప్రూవ్ చేస్తారని ఆయన ప్యాన్స్, నెటిజన్స్ మేకింగ్ వీడియో చూసి కామెంట్స్ రూపంలో రియాక్ట్ అవుతున్నారు..
మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం చియాన్ విక్రమ్ కరికాల చోళుడుగా నటిస్తోన్న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. తంగలాన్ మూవీ కూడా ఇదే ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.