E-Paper
Advertisement

Tharun Bhascker Birthday Special : నవతరం మెచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ .. బర్త్ డే స్పెషల్..

Tharun Bhascker Birthday Special : నవతరం మెచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ .. బర్త్ డే స్పెషల్..
Advertisement

Tharun Bhascker Birthday Special : టాలీవుడ్ డైరెక్టర్స్ లో కొంతమంది చాలా తక్కువ సినిమాలు తీసినా మంచి పేరు తెచ్చుకోవడం తోపాటు బాగా పాపులర్ అవుతారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా పేరు మాత్రం సంపాదించుకోలేక నిరాశకు గురి అవుతారు. అందుకే చిత్రసీమను చిత్ర విచిత్రాల సీమ అని అంటారు. ఇలా కొన్ని సినిమాలతో.. మంచి కంటెంట్ తో.. జనాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మరి అలాంటి డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1988 నవంబర్ 5వ తారీఖున మద్రాసులో తరుణ్ భాస్కర్ జన్మించారు. అయితే పెరిగింది మాత్రం హైదరాబాదులోని. మొదటినుంచి మూవీస్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో న్యూ యార్క్ ఫిలిం అకాడమీలో సినిమా మేకింగ్ పట్టా పొందాడు. ఇక సొంతంగా పెళ్లిచూపులు అనే కథ రాయడమే కాకుండా దాన్ని జనాల ముందుకి వినూత్నంగా తీసుకువచ్చాడు. ఈ మూవీ పుణ్యమా అంటూ విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

ఫస్ట్ మూవీ తోనే వైవిధ్యమైన టాలెంట్ కనబరచడంతో తరుణ్ భాస్కర్ కి మంచి గుర్తింపు రావడమే కాకుండా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. కానీ పరిగెత్తి పాలు తాగడం బదులు హ్యాపీగా నిలబడి నీళ్లు తాగి ప్రశాంతంగా ఉండొచ్చు అని భావించి కెరియర్ లో ఆచితూచి అడుగులు వేశాడు. తరుణ్ డైరెక్షన్లో వచ్చిన మరొక చిత్రం ఈ నగరానికి ఏమైంది? యువతను బాగా ఆకట్టుకుంది. తరుణ్ లో ఒక డైరెక్టర్ ..రచయిత మాత్రమే కాదండోయ్ మంచి యాక్టర్ కూడా ఉన్నాడు.

ఇది గమనించిన నాగ్ అశ్విన్.. మహానటి మూవీలో సింగీతం శ్రీనివాస్ పాత్ర చేసే అవకాశం తరుణ్ కి అందించారు. ఆ తరువాత సమ్మోహనం, ఫలక్ నుమా దాస్ ,మీకు మాత్రమే చెప్తా,మిడిల్ క్లాస్ మెలోడీస్ ,స్కైలాబ్,సీతా రామం, దాస్‌ కా ధమ్కీ,బాయ్స్ హాస్టల్ మూవీస్ లో కూడా తరుణ్ తెరపై తలుక్కుమన్నాడు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కీడా కోలా.. అనే ఒక వెరైటీ క్రైమ్ కామెడీ స్టోరీ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు.

Advertisement

చాలా రోజుల తర్వాత ఈ మూవీలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా తరుణ్ భాస్కర్ నిర్వహించారు. మరి భవిష్యత్తులో కూడా మరిన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ డైరెక్ట్ చేసి.. తరుణ్ భాస్కర్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆశిస్తూ.. బిగ్ టీవీ తరఫున అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×