BigTV English

Devara: ‘దేవర’కు అదే మైనస్.. కన్ఫ్యుజన్‌లో ఫ్యాన్స్?

Devara: ‘దేవర’కు అదే మైనస్.. కన్ఫ్యుజన్‌లో ఫ్యాన్స్?

Devara Movie : ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమా మేనియా కొనసాగుతుంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మరి కొద్ది గంటల్లో ఇండియాలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. ఈ పాటికే థియేటర్లను అభిమానులు ముస్తాబు చేసి సిద్ధం చేశారు. అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దేవరాను చూసిన ఓవర్సీస్ లోని డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ రివ్యూలు ఇస్తున్నారు. ఎలాంటి రివ్యులు ఇచ్చారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఇండియాలో కన్నా ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా షోలు పడతాయన్న సంగతి తెలిసిందే.. వాటిని చూసిన నందమూరి అభిమానులు షాక్ లో మునిగిపోతున్నారు. మరి ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన రివ్యూలు ఎలా ఉన్నాయి అంటే.. కొంతమందేమో దేవర యాక్షన్స్ సన్నివేషాలు చాలా బాగున్నాయి అంటే మరి కొంతమంది ఏమో స్క్రీన్ ప్లే రివర్స్ లో ఉండడం కారణంగా ఈ సినిమా చూసి ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజన్లో పడిపోతారని అంటున్నారు.. సినిమాకు ఒకే ఒక్క మైనస్ తప్ప మిగిలినవి అన్ని బాగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ మైనస్ ఏంటో చూద్దాం..

అసలు విషయానికొస్తే.. సినీ విమర్శకుడు, రివ్యూవర్ ఉమైర్ సందు జాన్వి కపూర్ పాత్ర చాలా ఇరిటేటింగ్ గా ఉంది అంటూ ట్వీట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా జాన్వీ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుందని, ఈమె సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ మాములుగా లేదని, సైఫ్ ఆలీ ఖాన్ అయితే తన పాత్రలో లీనమై పోయడానికి ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఉమైర్ సందు రివ్యూ ను ఎవరు ఎక్కువగా పట్టించుకోక పోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల రివ్యూలు పాజిటివ్ గా ఉండడంతో చాలామంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రివర్స్ స్క్రీన్ ప్లే ని అర్థం చేసుకుంటే సినిమా మొత్తం చాలా అమేజింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఇండియాలో రేపు రిలీజ్ కాబోతుంది. జనాల అంచనాలు రీచ్ అయ్యేలా దేవర ఉంటుందో లేదో చూడాలి..


ఇక త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మొదటి సినిమా, అందులోనూ సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా పై అసలు పెట్టుకున్నాడు. అటు కొరటాల శివకి ఆచార్య ప్లాఫ్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఓవర్ గానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది. ఇక సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుందా? కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉన్నాయి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×