BigTV English

Gopichand Malineni : కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవ్వక రవితేజ ప్రాజెక్టు వదిలేయాల్సి వచ్చింది

Gopichand Malineni : కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవ్వక రవితేజ ప్రాజెక్టు వదిలేయాల్సి వచ్చింది

Gopichand Malineni : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో రవితేజకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా రవితేజకు యాంటీ ఫ్యాన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది ఒక రకంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ని మొదలుపెట్టిన రవితేజ నటుడుగా తన ప్రయాణాన్ని మలుచుకున్నాడు. ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ చేసిన చాలా సినిమాలకు అద్భుతమైన పేరు వచ్చింది. ఇక రవితేజ కొంతమంది కొత్త దర్శకులను కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. స్వతహాగా అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో డైరెక్టర్ల కష్టాన్ని గుర్తించాడు అని చెప్పాలి. హరీష్ శంకర్ లాంటి దర్శకుడికి రెండోసారి అవకాశం కూడా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు.


గోపీచంద్ మలినేని

డాన్ శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. గోపీచంద్ మలినేని ఎంతమందితో సినిమాలు చేసినా కూడా రవితేజ హీరో అంటే కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు మంచి హిట్లు. ఇక క్రాక్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అయితే వీరిద్దరూ కలిసి 4 సినిమాను చేయబోతున్నట్లు అప్పట్లో ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని ఈక్వేషన్స్ వలన ఆ సినిమా కుదరలేదు. ఇక రీసెంట్ గా జాట్ అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు గోపిచంద్. అయితే మళ్లీ తాను కలిసి రవితేజతో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. అయితే అది క్రాక్ 2 కూడా అవ్వచ్చు అని క్లారిటీ ఇచ్చాడు.


బాబి

రచయితగా కొన్ని సినిమాలకు పని చేస్తున్న బాబీ పవర్ అనే సినిమా కథను రవితేజకు నెరేట్ చేసాడు. కథ నచ్చిన వెంటనే రవితేజ కూడా డైరెక్షన్ నువ్వే చెయ్ అంటూ బాబిని దర్శకుడు చేసేసాడు. ఇక బాబీ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ తో ముందుకు వెళ్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో పనిచేసే అవకాశం బాబీకి దక్కింది.

హరీష్ శంకర్

అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా రచయితగా ప్రయాణిస్తున్న హరీష్ శంకర్ కు. రవితేజ షాక్ సినిమాతో మంచి అవకాశాన్ని ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత హరీష్ మళ్లీ మొదటికి వచ్చాడు. అయినా కూడా రవితేజ పిలిచి మిరపకాయ్ సినిమా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకుంది. ఇప్పటికీ హరీష్ అనగానే మొదటి గుర్తు వచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఇలా కొంతమంది దర్శకులను కూడా రవితేజ ఎంకరేజ్ చేశాడు.

Also Read : NTRNeel: రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది, అప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×