BigTV English

NTRNeel: రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది, అప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు

NTRNeel: రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది, అప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు

NTRNeel: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఉగ్రం సినిమాతో కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తను తెరకెక్కించిన కే జి ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో భారీ ఎలివేషన్ సీన్స్ తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ కూడా చూపించాడు. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా హిట్ అవ్వగానే ప్రశాంత్ ఇంకా తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.


ప్రభాస్ కు కంబ్యాక్

బాహుబలి సినిమా ప్రభాస్ కెరియర్ లో ఎంత పెద్ద ప్లస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ ని సాధించలేకపోయాయి. రాజమౌళి సెంటిమెంట్ వెంటాడింది అనుకుంటే, ప్రభాస్ కి అది మూడు సినిమాలకు జరిగింది. ఇక ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా కొంత ఉపశమనం కలిగించింది. అభిమానులు ప్రభాస్ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో వాటిని సినిమాలో పొందుపరిచాడు ప్రశాంత్. తన ఉగ్రం సినిమాని కొంచెం మెరుగులు దిద్ది సలార్ గా మలిచాడు. ఏదేమైనా ప్రేక్షకులకు మాత్రం ఒక విజువల్ ట్రీట్ ఇచ్చాడు.


ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అప్పుడే

ప్రస్తుతం ప్రశాంత్ ఎన్టీఆర్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 18 కిలోలు బరువు తగ్గాడు ఎన్టీఆర్. ఈ సినిమాని మొదలు పెడుతున్నట్లు ఒక ఫోటోని రిలీజ్ చేసి రీసెంట్గా అధికారక ప్రకటన చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసింది చిత్ర యూనిట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జూన్ 25న 2026లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇక అప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూడకు తప్పదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చెప్పిన డేట్ కు ఏ సినిమాలో రావడం లేదు. మరి ఈ డ్రాగన్ సినిమా విషయంలో ఎంతవరకు ఆ మాటను చిత్ర యూనిట్ నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా ఖరారు చేయలేదు. బట్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా గురించి ఎదురు చూస్తున్నాను. అని చెప్పడంతో ఆల్మోస్ట్ ఇదే టైటిల్ అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

Also Read : Single Movie : శ్రీ విష్ణు ఇక మంచు కురిసిపోయినట్లేనా..? ఆ డైలాగ్ పై హీరో సీరియస్… కేసు కూడా..?

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×