BigTV English

NTR 30 : NTR 30కి షాకిచ్చిన హీరో..

NTR 30 : NTR 30కి షాకిచ్చిన హీరో..
NTR 30

NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ NTR 30. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో దీన్ని రూపొందిస్తున్నారు. కాబ‌ట్టి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా కొర‌టాల సినిమాను డిజైన్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందుకోసం ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.


అలాగే NTR 30లో విల‌న్‌గా సైఫ్ అలీఖాన్ న‌టిస్తాడ‌నే వార్త‌లు వినిపించాయి. కానీ మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇప్పుడు ఈ సినిమాలో న‌టించ‌టానికి సైఫ్ అలీఖాన్ ఓకే చెప్ప‌లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే ప్ర‌తినాయ‌కుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించి ఉండుంటే బావుండేది. కానీ.. తాజా స‌మాచారం మేర‌కు సైఫ్ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడంటున్నారు. మ‌రి ఆయ‌న స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారో చూడాలి మ‌రి. ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ను బేస్ చేసుకునే కొర‌టాల ఈసారి యంగ్ టైగ‌ర్‌ను ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చూపించ‌బోతున్నారు. కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ అనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ సెట్ వేశారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై హ‌రికృష్ణ‌.కె, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా అలాగే.. జ‌న‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీ కావ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×