Oru Jaathi Jathakam : ‘వర్షాంగల్కు శేషం’ సక్సెస్ తర్వాత, నటుడు-దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ చేస్తున్న కొత్త కామెడీ-డ్రామా ‘ఒరు జాతి జాతకం’ (Oru Jaathi Jathakam). ఈ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన వినీత్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఒమన్ మినహా గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేశారు అనేది తాజా సమాచారం. మరి ఈ మూవీని ఎందుకు అక్కడ బ్యాన్ చేశారు ? అనే వివరాల్లోకి వెళ్తే…
గల్ఫ్ లో ‘ఒరు జాతి జాతకం’ బ్యాన్
వినీత్ శ్రీనివాసన్ హీరోగా ‘ఒరు జాతి జాతకం’ (Oru Jaathi Jathakam) అనే కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. జనవరి 31న విడుదల కావాల్సిన ఈ మూవీని కొన్ని గల్ఫ్ దేశాలలో బ్యాన్ చేశారు. అరవిందంటే అతిడికల్’, ‘916’, ‘మై గాడ్’, ‘మాణిక్యకల్లు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మోహనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు ఉన్న కారణంగా గల్ఫ్ దేశాలలో బ్యాన్ చేశారని సమాచారం. అయితే ఇలాంటి సినిమాలను అక్కడ బ్యాన్ చేయడం అనేది కొత్తేమీ కాదు. గతంలో మమ్ముట్టితో సహ పలువురు స్టార్ హీరోల సినిమాలు కూడా ఇదే సమస్యతో గల్ఫ్ దేశాల్లో బ్యాన్ అయ్యాయి. తాజాగా ఆ లిస్ట్ లో ‘ఒరు జాతి జాతకం’ కూడా చేరింది. ఒక్క ఒమన్ తప్ప మిగతా గల్ఫ్ దేశాల్లో ఈ మూవీపై బ్యాన్ ఉంటుంది.
సినిమాలో బ్యాన్ చేసేంతగా ఏముంది ?
రీసెంట్ గా ప్రమోషన్లలో భాగంగా మలయాళ మూవీ ‘ఒరు జాతి జాతకం’ (Oru Jaathi Jathakam) ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి చూస్తే చెయి చూసి జాతకం చెప్పడంలో మంచి నైపుణ్యం ఉన్న ఒక మహిళను కలిశాక హీరో జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. హీరో జయేష్ తనకు నచ్చే విధంగా పర్ఫెక్ట్ గా ఉండే అమ్మాయిని వివాహం చేసుకోవాలని తహతహలాడతాడు. కానీ కొంతమంది అతనిని హోమో సెక్సువల్ గా ట్యాగ్ చేసి ఎగతాళి చేస్తారు. నిజానికి జయేష్ అలాంటివాడు కాకపోయినా, ఆ ప్రచారం వల్ల ఇబ్బందుల్లో పడతాడు. పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతీసారి రిజక్షన్ ను ఎదుర్కొంటాడు. మరి జయేష్ కు నచ్చిన అమ్మాయి దొరికిందా? తనపై వేసిన ఆ ట్యాగ్ అబద్ధం అని ఎలా నిరూపించాడు? అనేది ఈ కామెడీ ఎంటర్టైనర్ ను తెరపై చూస్తే అర్థం అవుతుంది.
రిలీజ్ పోస్ట్ పోన్
ఇదిలా ఉండగా ‘అరవిందంటే అతిధికల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నటుడు వినీత్ శ్రీనివాసన్ , దర్శకుడు ఎం. మోహనన్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ‘ఒరు జాతి జాతకం’. అలాగే హీరోయిన్ నిఖిలా విమల్ – వినీత్ జంటగా నటిస్తున్న ‘ఒరు జాతి జాతకం’ మూవీ నిజానికి 2024 ఆగష్టు 22 న రిలీజ్ కావలసి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడి, ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.