Bus Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ RTC బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు. బస్సు కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వస్తుండగా.. గోరింట్యాల గ్రామ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది.
బస్సు టైర్ పేలి పొలాల్లోకి వెళ్లడంతో.. ఒక్కసారిగా ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ అప్పమత్తతో బస్సును కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. బస్సులో చిన్నారులతో సహా.. వృద్ధులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో నుండి ప్రయాణికులను ఒక్కొకరిని బయటకు తీస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్పగాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతున్నవారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. అక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే.. ఇంకా ఏదైనా బావి కాని, పెద్దగోడ అలాంటివి ఉండి ఉన్నట్లైయితే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని.. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: భార్యాబాధితులు.. ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు హంతకుడయ్యాడు
ఇదిలా ఉంటే.. మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి దుండిగల్ వెళ్లే రోడ్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంగమేశ్వర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.