BigTV English

Layoffs Amazon Meta : భారీగా లాభాలున్నా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే

Layoffs Amazon Meta : భారీగా లాభాలున్నా వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే

Layoffs Amazon Meta | దిగ్గజ టెక్ కంపెనీలు లాభాల మార్గంలో ముందుకు సాగుతున్న సమయంలో, ‘అమెజాన్’ (Amazon) మరోసారి లేఆఫ్స్ ప్రకటించనుంది. కంపెనీ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు.. సంస్థలోని కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే, ఈ లేఆఫ్స్ ఎంతమంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కంపెనీ వర్గాల ప్రకారం.. ఈ సంఖ్య వేలల్లో ఉండే అవకాశం ఉంది.


కంపెనీ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఆఫ్స్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ఒక కష్టమైన నిర్ణయమే, కానీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి, సంస్థ పనితీరును మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్మాణాత్మక మార్పు అవసరమని సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ బాధ్యతను పర్యవేక్షిస్తున్న ‘డ్రూ హెర్డెనర్’ (Drew Herdener) పేర్కొన్నారు.

అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ 2021లో బాధ్యతలు స్వీకరించిన తరువాత కంపెనీని పునర్నిర్మించడానికి, అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే గతంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. అయితే తాజాగా ఆయన ఈ లేఆఫ్స్ చేయడానికి మరోమారు నిర్ణియించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


2022లో కంపెనీ వివిధ విభాగాల్లో 27,000 మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తొలగించాయి. అందుకే ఉద్యోగులందరూ ఆఫీస్ బాట పట్టారు.

Also Read: అమెరికా సాయంచేయకపోతే ఏడుస్తూ కూర్చుంటారా? లేవండి.. ఆఫ్రికా దేశాలకు కెన్యా మాజీ అధ్యక్షుడి పిలుపు

తెలంగాణలో అమెజాన్‌ పెట్టుబడి రూ. 60 వేల కోట్లు
తెలంగాణలో డేటా సెంటర్ల విస్తర్ణలో భాగంగా రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ సిద్ధమైంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం, ‘అమెజాన్‌ వెబ్‌ సర్విసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ’ వైస్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెటా కంపెనీ తాజాగా 3000 పైగా ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా (ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృక కంపెనీ) 2024లో 62.36 బిలియన్ డాలర్ల భారీ లాభాలను ప్రకటించింది. 2023 కంటే ఇది 59 శాతం ఎక్కువ. డిసెంబర్ 2024లో అయితే మెటా యాక్టివ్ యూజర్ల సంఖ్య 3.35 బిలియన్లుగా నమోదైంది. మెటా సిఈఓ మార్క జుకర్ బర్గ్ తమ మెటా ఏఐ యూజర్లు వేగంగా పెరుగుతున్నారని తెలిపారు. 2025 కల్లా బిలియన్ యూజర్లు మెటా ఏఐ వినియోగించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఏఐ టెక్నాలజీ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అందుకోసం ఏఐ నైపుణ్యం ఉన్న కొత్తవారికి ఉద్యోగులు కల్పిస్తామని తెలిపారు.

కానీ మెటా కంపెనీ తాజాగా 3600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీనికి కారణం కూడా ఏఐనే. ప్రస్తుతం మెటా ఉద్యోగులు సంఖ్య 74,067 ఉండగా.. వీరిలో పనీతీరు సరిగాలేని వారినే తొలగించినట్లు మెటా అధికారికంగా ప్రకటించింది. పైగా ఏఐ వల్ల కంపెనీ ఖర్చులు బిలియన్లలో ఉండడంతో ఏఐ నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు కల్పించేందుకు కొంతమందిని తొలగించాల్సి వచ్చిందని తెలిపింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×