BigTV English

The Raja Saab: ‘రాజా సాబ్’ పోస్టర్ రిలీజ్.. అరే ఏంట్రా ఇది?

The Raja Saab: ‘రాజా సాబ్’ పోస్టర్ రిలీజ్.. అరే ఏంట్రా ఇది?

The Raja Saab New Poster: ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ ఎక్కువగా యూనివర్సల్ స్క్రిప్ట్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘బాహూబలి’ తర్వాత కేవలం తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగినట్టుగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. కానీ మొదటిసారి తెలుగు ప్రేక్షకులను, అది కూడా కామెడీ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు ప్రభాస్. మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ‘రాజా సాబ్’గా మారాడు ఈ హ్యాండ్‌సమ్ హీరో. తాజాగా ఈ మూవీ నుండి ఒక పోస్టర్ విడుదల కాగా అది ఫ్యాన్స్‌ను విపరీతంగా డిసప్పాయింట్ చేసింది.


డిఫరెంట్ లుక్స్

‘రాజా సాబ్’ (The Raja Saab) షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ బయటికి రానివ్వలేదు మేకర్స్. అప్పుడప్పుడు సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి ఫోటోలు లీక్ అవ్వడం తప్పా అసలు ఇందులో ప్రభాస్ ఎలా ఉంటాడు అనే విషయం కూడా తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పటివరకు ‘రాజా సాబ్’ నుండి ఒక పోస్టర్, ఒక గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యింది. ఇక విడుదలయిన పోస్టర్‌లో ప్రభాస్ లుంగీలో మాస్‌గా కనిపించగా.. గ్లింప్స్‌లో మాత్రం లవర్ బాయ్‌లాగా కనిపిస్తూ ‘డార్లింగ్’ సినిమా రోజులను గుర్తుచేశాడు. తాజాగా కూల్ లుక్‌లో ప్రభాస్‌కు సంబంధించిన మరొక పోస్టర్ విడుదలయినా కూడా అది ఫ్యాన్స్‌ను అంతగా తృప్తిపరచలేదు.


Also Read: రీ రిలీజ్‌లో ఇదొక రికార్డ్.. రెండున్నర సంవత్సరాలుగా అదే సినిమా స్క్రీనింగ్

టీజర్ వస్తుందేమో

తాజాగా విడుదలయిన ‘రాజా సాబ్’ పోస్టర్‌లో చెక్స్ షర్ట్, లైట్ కలర్ టీషర్ట్‌లో ప్రభాస్ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. కానీ గమనించి చూస్తే ఈ పోస్టర్‌ను ఏఐతో డిజైన్ చేశారని క్లియర్‌గా తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారని మరీ ఇలా చేయాలా అని ఫీలవుతున్నారు. ఈ పోస్టర్‌ను విడుదల చేయడానికి మరొక స్పెషల్ సందర్భం కూడా ఉంది. అక్టోబర్ 23న ‘రాజా సాబ్’కు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ కాకపోయినా ఏదో పెద్ద అప్డేట్‌తోనే ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ విషయం క్లారిటీ ఇవ్వడం కోసం ఇప్పుడు ఈ పోస్టర్ బయటికొచ్చింది.

షూటింగ్ పూర్తికాలేదు

ప్రభాస్ (Prabhas), మారుతీ (Maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రాజా సాబ్’ సినిమా అసలైతే 2025 సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ అప్పటికీ చాలామంది సీనియర్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడం, ‘రాజా సాబ్’ షూటింగ్ కూడా ఇంకా పూర్తికాకపోవడం వల్ల వెనక్కి తప్పుకుంది. సంక్రాంతి నుండి ఏకంగా సమ్మర్‌కే పోస్ట్‌పోన్ అయ్యింది ఈ మూవీ. పోస్ట్‌పోన్ అయినా పర్వాలేదని, క్వాలిటీ బాగుంటే అదే చాలు అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 2025 ఏప్రిల్ 10న ‘రాజా సాబ్’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదొక హారర్ కామెడీ కావడం విశేషం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×