BigTV English

Kalyan Ram : దేవర ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ట్రోల్స్ పై కళ్యాణ్ రామ్ రియాక్షన్

Kalyan Ram : దేవర ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ట్రోల్స్ పై కళ్యాణ్ రామ్ రియాక్షన్

Kalyan Ram : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేస్తాడు అంటూ మంచి పేరు కూడా ఉంది. నేడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సాధించుకున్న సురేందర్ రెడ్డిని పరిచయం చేసింది కళ్యాణ్ రామ్. అలానే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేస్తున్న వశిష్ట ను పరిచయం చేసింది కళ్యాణ్ రామ్. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క డిజాస్టర్ కూడా తీయని అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇకపోతే కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కళ్యాణ్ రామ్.


దేవర సినిమా గురించి

ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ కలిపి సంయుక్తంగా నిర్మించిన సినిమా దేవర. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయింది. అయితే మొదట ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా గురించి ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. చివరి 40 నిమిషాలు సినిమాలో అదిరిపోతుంది అన్నారు అసలు ఏముంది అంటూ కొంతమంది. ఇంకొంతమంది మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ అసలు బాలేదు అంటూ కామెంట్ చేశారు. అయితే వాటన్నిటి గురించి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.


Also read : Allu Arjun: ఆర్య సినిమా స్టార్ట్ అవ్వడానికి, దర్శకుడు వశిష్ట ఫాదర్ ఇంత హెల్ప్ చేశారా.?

అసలు పట్టించుకోను

క్వాలిటీ ఆఫ్ మేకింగ్ తక్కువగా ఉంది అని అంటే తమ్ముడు చాలా పెద్ద హీరో ఆయనకు తెలియదా.? కొరటాల శివ చాలా పెద్ద డైరెక్టర్ ఆయనకు తెలియదా.? ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది నాకు సొంత బ్యానర్ ఎలానో తమ్ముడు కూడా అంతే. ఎక్కువ శాతం నెగిటివ్ మాట్లాడుతారు కానీ పాజిటివ్ విషయం చెప్పరు. మన తెలుగు ఇండస్ట్రీలో అటువంటి విజువల్స్ మీరు చూశారా.? వాటర్ మీద ఎన్ని ఎపిసోడ్స్ జరిగాయి. సో ఆ సినిమాకి సంబంధించిన కష్టం మాకు తెలుసు. నేను అసలు నెగెటివిటీ గురించి పట్టించుకోను కొంతమందికి రిప్లై కూడా ఇవ్వను. మీరు అడిగారు కాబట్టి ఇది కూడా చెప్పాల్సి వస్తుంది అంటూ కళ్యాణ్ రామ్ ఆ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.

Also Read : Sampath Nandi : రామ్ చరణ్ తో రెండో సినిమా గురించి అడిగితే అలా మాట్లాడేసాడు ఏంటి.?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×