BigTV English

CM Chandrababu Angry on Jagan: జగన్‌‌పై సీఎం ఆగ్రహం, మెడికల్ కాలేజీ సీట్లు.. ఆ జీవో సీక్రెట్..

CM Chandrababu Angry on Jagan: జగన్‌‌పై సీఎం ఆగ్రహం, మెడికల్ కాలేజీ సీట్లు.. ఆ జీవో సీక్రెట్..

CM Chandrababu Angry on Jagan: చంద్రబాబు సర్కార్‌ను వైసీపీ ఇబ్బందిపెడుతోందా? వైసీపీ లేవనెత్తిన అంశాలను కూటమి సర్కార్ ప్రతిఘటించ లేకపోతోందా? గత ప్రభుత్వ లోపాలను తప్పించుకునేందుకు రోజుకో అంశాన్ని ఆ పార్టీ తెరపైకి తెస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడి పదేళ్లు అయ్యింది. అధికార, విపక్షాలు చెరో ఐదేళ్లు పాలించాయి. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను సర్వనాశనం చేసిందని పదేపదే చెబుతోంది చంద్రబాబు సర్కార్. బడ్జెట్ సైతం పెట్టలేని పరిస్థితి వచ్చిందంతే కారణం అదేనని చెబుతోంది.

మొన్నటివరకు విజయవాడ వరదల రాజకీయాలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా మెడికల్ కాలేజీ సీట్ల వ్యవహారంపై రోజుకో విధంగా అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ.


వైసీపీ అధికార గెజిట్‌లో తాటికాయంత అక్షరాలతో డాక్టర్ అవ్వాలనుకునే వారికి ఆశలు చంద్రబాబు సర్కార్ అడియాశలు చేసిందంటూ రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై ఇంటాబయటా విమర్శలు రేగుతున్నాయి. దీనిపై కౌంటర్ల మీద కౌంటర్లు సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. ఎవరైనా ప్రజలకు మంచి చేయాలని భావిస్తున్నారు. అలాంటి వైద్య విద్యను ఏపీ విద్యార్థులకు కూటమి సర్కార్ దూరంగా చేసే ప్రయత్నం చేస్తోందని గడిచిన నాలుగైదు రోజులుగా వార్తలను వండి వార్చుతోంది వైసీపీ.

ALSO READ:  సీఎం చంద్రబాబుతో సునీత దంపతులు.. అజ్ఞాతంలో ఆ నేత, రేపో మాపో..

సోమవారం రాత్రి మీడియా ముందకు వచ్చిన సీఎం చంద్రబాబు.. మెడికల్ సీట్ల వ్యవహారంపై మీడియా పలు ప్రశ్నలను లేవనెత్తింది. చంద్రబాబు సర్కార్ వచ్చి 100 రోజులు అవుతుందని, మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయని, విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారంటూ వైసీపీ చేస్తున్న రచ్చను ప్రస్తావించింది. దీనిపై తనదైనశైలిలో రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు.

జగన్ సర్కార్ ఇచ్చిన జీవోను ఒక్కసారి చదువు కోవాలన్నారు ముఖ్యమంత్రి. ఈ జీవో కాకుండా.. ఇంకేమి అమలు చేశారో చెప్పాలన్నారు. ఆ జీవోను మీడియా మిత్రలు ఒక్కసారి చదవాలన్నారు. అప్పుడు మీకు ఐడియా వస్తుందన్నారు. తప్పుడు పనులు చేసి వేరేవాళ్ల మీదకు తోయాలని భావిస్తే జరగదన్నారు. ఆ రోజులు అయిపోయాయని, నోటి కొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

ఈ జీవో గురించి చెబుతే రహస్యం అందరికీ తెలిసిపోతుందన్నారు సీఎం చంద్రబాబు. దాని గురించి ఇరిటేట్ అయిపోవాల్సిన అవసరం లేదని, దాని వల్ల వచ్చింది ఏమీ లేదన్నారు. వీళ్లు చెల్లని కాసులని, అందుకే అలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

త్రేతాయుగంలోనూ ఇలాంటివి చూశామని, ఆనాడు రాజులు యజ్ఞాలు చేసేవారని, రాక్షసులు వారిని చెడగొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాక్షసులపై పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు సీఎం చంద్రబాబు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×