Trolls on RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ప్లే ఆఫ్ లోకి వెళ్ళినా కూడా… ఎక్కడో తెలియని టెన్షన్ నెలకొంది. దీని అంతటికి కారణం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. శుక్రవారం రోజున.. సాయంత్రం పూటనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హైదరాబాద్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. నరకం స్పెల్లింగ్ రాయించారు హైదరాబాద్ ప్లేయర్స్. పోతూ పోతూ.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అంతు.. చూసే వెళ్లిపోయారు.
Also Read: Ban on CSK – RR : 2016, 2017 లో రాజస్థాన్, CSK పై బ్యాన్.. కారణం ధోని కుట్రలేనా?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు యముడిలా మారిన హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు… యముడిలా మారింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కచ్చితంగా గెలవాల్సిన సమయంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన మ్యాచ్ అంటే హైదరాబాద్ ప్లేయర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు ఫామ్ లో లేని ఇషాన్ కిసాన్ ( ISHAN kISHAN SRH) కూడా ఇరగదీశాడు. 2016 సమయంలో ఫైనల్ కు వెళ్లిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కప్పు దూరం చేసిన డేంజర్ టీం హైదరాబాదు ఒక్కటే. ఇక ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో మొదటి స్థానానికి… ఒక్క అడుగు దూరంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది హైదరాబాద్. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ఒక ఆట ఆడుకుంది. ఈ మ్యాచ్లో ఏకంగా 42 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వెనక్కి లాగేసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై ట్రోలింగ్
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore ) మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్. వీళ్లకు బుద్ధి రాదు.. వరుసగా మ్యాచ్లు గెలిచామని ఎగిరి గంతేశారు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో కింద లో ఉన్న… సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారంటూ.. దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. డిజె టిల్లు సినిమాలో (DJ TILLU ).. హీరో జొన్నలగడ్డకు హీరోయిన్ రాధికా ( RADHIKA) చుక్కలు చూపిస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా దరిద్రం లాగా రాధిక.. హీరోకు తగులుకుంటుంది. అయితే ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా అదే పరిస్థితి నెలకొంది. కీలకమైన సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ) విజయాలకు హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) అడ్డుపడుతోంది.
Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి షాక్….అకౌంట్ హ్యాక్?