Game Changer Pre Release Event: భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju)నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, శంకర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara advani), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే జనవరి 10వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టింది చిత్ర బృందం.. అందులో భాగంగానే జనవరి 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో ఓపెన్ గ్రౌండ్లో చాలా అట్టహాసంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు. అంతేకాదు చిత్ర బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఎల్ఈడీ స్క్రీన్ లు ధ్వంసం చేసిన ఆకతాయిలు..
ఇదిలా ఉండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత.. కొంతమంది ఆకతాయిలు పబ్లిక్ వీక్షణ కోసం పెట్టిన ఎల్ఈడీ స్క్రీన్ లను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తతగా మారింది. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
ఇదిలా వుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు. దీంతో ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెరో కుటుంబానికి రూ.5,00,000 చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది.
రామ్ చరణ్ సినిమా విశేషాలు..
రామ్ చరణ్ మొదట మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీలోకి ‘చిరుత’ సినిమాతో అడుగుపెట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఇది చూసిన కొంతమంది తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో విజయం సాధించాడని, అసలు హీరోనే కాదని విమర్శలు గుప్పించారు. అయితే ఆ తర్వాత చిత్రానికే తన మేకోవర్ పూర్తిగా మార్చేసిన రామ్ చరణ్, రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మగధీర (Magadheera)సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాతో ఒక్క నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత వరుసగా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించిన రామ్ చరణ్, మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో తన స్నేహితుడు ఎన్టీఆర్ (NTR)తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడమే కాదు ఏకంగా గ్లోబల్ స్థాయిని అందించింది. ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.