New Zealand New Visa Rules | భారతదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. న్యూజిలాండ్ప్రభుత్వం వీసా, ఎంప్లాయ్మెంట్ నిబంధనలు సరళీకృతం చేసింది. దీంతో విదేశీ ఉద్యోగస్తులు, లేబర్ వర్కర్లకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయింది.
కొత్తగా మార్పులు చేసిన నిబంధనల్లు ముఖ్యమైనది పనిఅనుభవం తగ్గించడం. ఇంతకుముందు విదేశాల నుంచి న్యూజిలాండ్ వచ్చే వర్కర్లు, ఉద్యోగస్తులకు తప్పనిసరిగా మూడు సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల అనుభవం చాలు. నిబంధనల్లో ఈ మార్పుల రావడంతో న్యూజిలాండ్ లో నైపుణ్యం కల ఉద్యోగం పొందడానికి ఇబ్బంది పడుతున్న వర్కర్లకు ఊరట లభించింది. ముఖ్యంగా న్యూ జిల్యాంగ్ నైపుణ్యం కల వర్కర్లలలో భారతీయుల సంఖ్య ఎక్కువ.
దీనంతటికి కారణం దేశంలో లేబర్, నైపుణ్యం కలిగిన వర్కర్ల కొరత ఉండడం. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి న్యూ జిల్యాండ్ ప్రభుత్వం వీసా నిబంధనలలో సరళీకృత మార్పులు తీసుకువచ్చింది. వీటికి తోడు న్యూ జిల్యాండ్ ప్రభుత్వం రెంుడ కొత్త వీసా ఆప్షన్స్ కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆప్షన్స్ సీజనల్ వర్కర్లకు మాత్రమే వర్తిస్తాయి. వ్యవసాయం, పర్యాటకం, లేదా పండుగల సీజన్లతో ఆయా రంగాల వర్కర్ల డిమాండ్ ఉంటుంది. మిగతా అన్ సీజన్ సమయంలో వారికి తక్కువగా పని ఉండడంతో పెద్ద సంఖ్యలో వర్కర్ల అవసరం ఉండదు. అందుకే సీజనల్ వర్కర్ల కోసం న్యూ జిల్యాండ్ ప్రభుత్వం మూడేళ్ల మల్టీ ఎంట్రీ వీసా తో పాటు తక్కువ నైపుణ్యం ఉన్న సీజనల్ వర్కర్ల కోసం ఏడు నెలల సింగిల్ ఎంట్రీ వీసా జారీ చేస్తోంది.
Also Read: ట్రంప్ కు జైలు శిక్ష?.. తగ్గేదెలే అంటున్న జడ్జి.. జనవరి 10న తీర్పు..
ఈ మార్పులతో సంబంధిత రంగాల సంస్థలు వారికి అవసరమున్న సమయంలో సీజనల్ వర్కర్లను విదేశాల నుంచి తీసుకురావచ్చు.
ఇక మరో ముఖ్యమైన వీసా రూల్ గురించి చెప్పాలంటే న్యూ జిల్యాండ్ ప్రభుత్వం గతంలో ఉన్న తప్పనిసరి మీడియన్ పే విధానాన్ని పూర్తిగా తొలగించేసింది. అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ వర్క్ వీసా (SPWV) లకు ఇకపై మీడియన్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీలు మాత్రం మార్కెట్ ను బట్టి వర్కర్లకు వారి నైపుణ్యం, ప్రాంతాన్ని బట్టి జీతభత్యలు నిర్ణయించే అధకారం ఇంకా ఉంది. ప్రత్యేకంగా వారికి ఇంత జీతం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం నిర్ధారణ చేయలేదు.
మరోవైపు న్యూ జిల్యాండ్ కు AEWV వీసా ఉన్నవారు తమ పిల్లలను తీసుకురావాలనుకుంటే వారి వార్షిక ఆదాయం కనీసం 55,844 న్యూజిల్యాండ్ డాలర్లు ఉండాలి. ఈ నిబంధన 2019 నుంచి కొనసాగుతూనే ఉంది. విదేశాల నుంచి వలస వచ్చిన కుటుంబాల ఆర్థిక భద్రత కోసమే ఈ నిబంధన ఇంకా కొనసాగితున్నట్లు ప్రభుత్వం తెలపింది.
అలాగే స్కిల్ లెవెల్ 4, 5 ఉద్యోగాల కోసం మూడేళ్ల అనుభవ నిబంధనలో మాత్రం ఏ మార్పు చేయలేదు. స్కిల్ లెవెల్ 4, 5 జాబితాలో వ్యక్తిగత సంరక్షణ సహాయకుడు, దిగుమతి-ఎగుమతి క్లర్క్ (స్థాయి 4), వృద్ధులు లేదా వికలాంగ సంరక్షకుడు, నర్సింగ్ సపోర్ట్ వర్కర్, డ్రిల్లర్, సైకిల్, బైక్ మెకానిక్ ఉద్యోగాలు ఉన్నాయి.
భవన నిర్మాణ రంగంలో లేబర్లకు రెండేళ్ల వరకు అనుభవం చాలు. న్యూజిలాండ్ భవన నిర్మాణ కూలీలు తీవ్రంగా ఉంది. ఏప్రిల్ 2025 నుంచి స్టూడెంట్ వీసాపై ఉన్నవారు.. AEWV నిబంధనల ప్రకారం.. ఇంటెరిమ్ వర్క్ వీసా పొందవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన భారతీయులు అక్కడే స్థిరపడేందుకు మూడేళ్ల పాటు వర్క్ వీసా కూడా పొందవచ్చు.