OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తారు మూవీ లవర్స్. అయితే కొన్ని సినిమాలు ఎక్కువ హింస కలిగి ఉంటాయి. అటువంటి సినిమాలు పెద్దలు మాత్రమే చూడటం బెటర్. ఈ మూవీలో భయంకరమైన హింస ఎక్కువగా ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సీజనింగ్ హౌస్‘ (The Seasoning house). ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి పాల్ హైట్ దర్శకత్వం వహించారు. ఈ భయంకరమైన బ్రిటిష్ మూవీలో రోసీ డే, కెవిన్ హోవర్త్, సీన్ పెర్ట్వీ నటించారు. ది సీజనింగ్ హౌస్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగే సంఘటన ఆధారంగా ఈ మూవీ తీశారు. సైనికులు చేసిన అరాచకాలతో కొంత మంది కుటుంబాలను కోల్పోతారు. అటువంటి అమ్మాయిలతో విక్టర్ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తుంటాడు. అక్కడికి వచ్చిన ఆడ వాళ్ళు చాలా దారుణంగా హింసించబడతారు. అప్పుడప్పుడు సైనికులు, ప్రముఖులు వచ్చి వీరిపై ఆఘాయిత్యం చేస్తుంటారు. ఈ క్రమంలో హీరోయిన్ ను అక్కడికి తీసుకొస్తారు. ఈమె తల్లిని, అక్కను కూడా సైనికులు చంపేస్తారు. ఆమె మూగ, చెవిటిది కావడంతో ఆమెను అక్కడ పనిచేసే విధంగా పెడతాడు విక్టర్. అయితే అక్కడ అమ్మాయిలను విపరీతంగా టార్చర్ చేస్తారు. అందులో కొంతమంది ఆ హింసను తట్టుకోలేక చనిపోతారు. చనిపోయిన తరువాత వాళ్లని కనికరం లేకుండా ఈడ్చుకుంటూ బయట పడేస్తారు. ఆ నొప్పిని తట్టుకునేకి హీరోయిన్ మత్తు ఇస్తుంది. హీరోయిన్ వాళ్ళకి మత్తు ఇచ్చే పని మాత్రమే చేస్తూ ఉంటుంది.
ఒకసారి ఒక అమ్మాయి కొనఊపిరితో ఉండగా, విక్టర్ మరి కొంతమందిని ఆమె దగ్గరికి పంపిస్తాడు. ఒక వ్యక్తి ఆ పని చేయగానే ఆ అమ్మాయి చనిపోతుంది. అది చూసి తట్టుకోలేక హీరోయిన్ అక్కడకు వచ్చిన ఒక వ్యక్తిని కత్తితో పొడుస్తుంది. మిలటరీ వ్యక్తి అయిన అతను అక్కడే చనిపోతాడు. ఆమెను చంపడానికి అక్కడున్న మిగతా వ్యక్తులు వెతుకుతారు. ఆమె తప్పించుకునే క్రమంలో విలన్ లు కొంతమంది చనిపోతారు. హీరోయిన్ అక్కడినుంచి ఒక ఇంటికి వెళుతుంది. ఆ ఇళ్ళు మరెవరిదో కాదు చనిపోయిన మిలటరీ ఆఫీసర్ ది. మిలటరీ హెడ్ ఆమె ఎక్కడుందో తెలుసుకుంటాడు. చివరికి హీరోయిన్ ఆ నరకం నుంచి బయటపడుతుందా? మిలటరీ వ్యక్తులు ఈ అమ్మాయిని ఏం చేస్తారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది సీజనింగ్ హౌస్’ (The Seasoning house) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.