Beauty Tips: అందమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ చర్మం ఇతరుల కంటే మెరుగ్గా, ఎల్లప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. తరచుగా అందమైన, మచ్చలు లేని ముఖం కోసం మార్కెట్లో లభించే ఉత్పత్తులపై ఆధారపడుతుంటారు. చాలా సార్లు ఈ ఉత్పత్తులు పని చేస్తాయి కానీ కొన్నిసార్లు అవి మన ముఖానికి ఎటువంటి ప్రయోజనాన్ని అందించవు. ముఖంపై మొటిమలు, మచ్చలు లేదా మొటిమలు ఉన్నవారికి కొన్ని రకాల హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. మరి ఎలాంటి హోం రెమెడీస్ వాడితే ముఖం కాంతివంతగా మారుతుంది. వాటిని ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలనే విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గాలంటే.. వాటిని వదిలించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ వాడాలి. ఈ రెమెడీస్ వాడటం వల్లఅనేక చర్మ సంబంధిత సమస్యల నుండి మీరు ఈజీగా బయటపడవచ్చు.
తేనె ఉపయోగం:
మీ చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి మీరు తేనెను ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీవైరల్ తో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ తేనెను ముఖంపై ఉపయోగించడం వల్ల మచ్చలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా చర్మం యొక్క ఛాయను మెరుగుపరచడంలో కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి.తేనెను ముఖానికి ఉపయోగించడం ద్వారా మీ ముఖం మృదువుగా మారుతుంది. ముందుగా తేనెలో పంచదార మిక్స్ చేసి ముఖాన్ని స్క్రబ్ చేసి చివరగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం ద్వారా మీ స్కిన్ అందంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం మీకు తేనె చాలా బాగా సహాయపడుతుంది.
అలోవెరా జెల్:
కలబందను చర్మానికి అమృతంలా భావిస్తారు. మీ చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే కలబందను తప్పనిసరిగా ఉపయోగించాలి. మొటిమలు, మచ్చలు, అనేక ఇతర సమస్యల నుండి బయటపడటంలో కలబంద మీకు చాలా సహాయపడుతుంది. కలబందను ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని హైడ్రేట్ గా మారుతుంది. అలోవెరా జెల్‌ని మీ ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు.
పెరుగు:
చర్మ సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందడానికి, మీరు తప్పనిసరిగా పెరుగును ఉపయోగించాలి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. పెరుగును ముఖానికి బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. చివరగా మంచినీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ ముఖంపై మచ్చలు తగ్గుతాయి.
Also Read: జ్వరం వచ్చినప్పుడు.. మందులు ఎప్పుడు వేసుకోవాలి ?
ఓట్స్ తో స్క్రబ్ చేయండి:
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి , స్క్రబ్ చేయడానికి మీరు ఓట్స్‌ని ఉపయోగించవచ్చు. మీకు ఇంతకంటే మెరుగైనది ఏదీ ఉండదు. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో మాత్రమే కాకుండా అదనపు ఆయిల్స్ ను కడిగివేయడంలో కూడా ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది. ముందుగా ఓట్స్‌లో మజ్జిగ మిక్స్ చేసి ముఖానికి పట్టించి బాగా స్క్రబ్ చేయాలి. ఇలా 10 నిమిషాలు చేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరుచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓట్స్ తో తయారు చేసిన స్క్రబ్ ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది.