BigTV English
Advertisement

OTT Movie : మనిషి పుట్టుక వెనుక దాగున్న సీక్రెట్… ఈ క్రేజీ సై-ఫై మూవీని చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : మనిషి పుట్టుక వెనుక దాగున్న సీక్రెట్… ఈ క్రేజీ సై-ఫై మూవీని చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలను చూస్తున్నంతసేపు ఏదో వేరే ప్రపంచంలో అడుగు పెట్టామా ? అన్నంత సంబ్రమాశ్చర్యాలు కలుగుతాయి. డ్రీమిగా అనిపించే ఈ సినిమాలలో మేకర్స్ ఊహకు కూడా అందని విషయాలను చూపిస్తూ ఉంటారు. అందుకే చాలామంది సైఫై సినిమాలు అంటే నోరు వెళ్ళబెట్టుకుని మరీ చూసేంతగా ఇష్టపడతారు. ఇక ఇలాంటి సైఫై సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు రూపొందించే కొన్ని సినిమాలు భాష అర్థం కాకపోయినా సరే చూడడానికి ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో ఓటీటీల పుణ్యమా అని తెలుగులోకి డబ్ అవుతున్న సినిమాల సంఖ్య కూడా గట్టిగానే ఉంది. అలా హాలీవుడ్లో తెరకెక్కిన ఓ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ మూవీ గురించే ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ సినిమా మనిషి పుట్టుక గురించి, ఫ్యూచర్ గురించి ఉంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…

సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడేవారు అదేపనిగా ఏ ఓటీటీలో ఏ సైఫై మూవీ స్ట్రీమింగ్ అవుతుందా అని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇక తరచుగా సైన్స్ ఫిక్షన్ సినిమాలను చూసేవారు సైంటిస్టుల్లా మారిపోయి తమ బుర్రల్లో తిరిగే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటారు. అలాంటి వాటిలో ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా అనేది మొదటి ప్రశ్న. అసలు భూమిపై మనిషి పుట్టుక ఎలా ఎప్పుడు జరిగింది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ? అనే ప్రశ్నలకు ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చక్కని సమాధానం అవుతుంది.


కథ విషయానికి వస్తే…

సినిమా ఓపెన్ కాగానే భూమి మీద జీవరాశిలేని టైం నుంచి మొదలైనట్టు చూపిస్తారు. చుట్టూ కొండలు, కోనలు, స్వచ్ఛంగా గలగల పారే అందమైన నదులు, జలజలా దూకే జలపాతాలు ఉంటాయి. ఇలాంటి సమయంలోనే ఓ ఏలియన్ భూమి మీదకి దిగుతుంది. అయితే విచిత్రంగా ఆ ఏలియన్ ఓ జలపాతం అంచున నిలబడి తనతో పాటు తెచ్చుకున్న ఓ డ్రింక్ ను తాగి వెంటనే ముక్కలు ముక్కలుగా మారి, ఆ నీళ్లలో పడిపోతుంది. దీంతో అదంతా నీళ్లలోకి చేరి భూమి మీద కొత్త జీవరాశి పుట్టడం జరుగుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ జీవరాశి మనిషిలా మారి భూమిపై మనుగడ సాగిస్తుంది. ఇలా గతం మొత్తం చూపించాక డైరెక్ట్ గా స్టోరీ 2091 అంటే ఫ్యూచర్లోకి వెళ్తుంది. ఐర్లాండ్లో కొంతమంది సైంటిస్టులు తవ్వకాలు చేపట్టగా, ఓ గుహలో 3500 ఏళ్ల ముందు గీసిన ఓ పిక్చర్ కనిపిస్తుంది. అందులో మనిషి నక్షత్రాలను చూపిస్తున్నట్టుగా కనిపించడంతో మనుషుల్ని సృష్టించిన వారు అక్కడే ఉన్నారని, స్పేస్ తమను ఆహ్వానిస్తోందని సదరు సైంటిస్టులు అనుకుంటారు. అందరూ కలిసి రోబో సహాయంతో స్పేస్ షిప్ లో వేరే గ్రహానికి వెళ్లాలనుకుంటారు. మరి ఈ సైంటిస్టులు అనుకున్నట్టుగా అక్కడ మనుషులను సృష్టించిన వాళ్ళు ఉన్నారా? అసలు సైంటిస్టులు అక్కడికి చేరుకోగలిగారా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే ‘ప్రోమెతియస్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×