Siddhu Jonnalagadda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. రీసెంట్ టైమ్స్ లో చాలామంది హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా తమలో ఉన్న మిగతా టాలెంట్ కూడా బయటకు తీస్తున్నారు. విశ్వక్సేన్ లో ఒక దర్శకుడు ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు. తరుణ్ భాస్కర్ లో ఉన్న నటుడు కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. అలానే నటుడుగా ఎన్నో సినిమాలు చేసిన సిద్దు జొన్నలగడ్డ రైటర్ గా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. సిద్దు రాసిన టిల్లు క్యారెక్టర్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సిద్దు జొన్నలగడ్డ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అండ్ మార్కెట్ ఏర్పడ్డాయి. ఈ తరుణంలోని సినిమాలు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకోవాలి.
జాక్ ఇచ్చిన క్రాక్
సిద్దు జొన్నలగడ్డ కెరియర్ సాఫీగా సాగుతుంది అనుకున్న టైంలో జాక్ సినిమా కెరియర్ కి చిన్న క్రాక్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత సిద్దుకి క్రేజ్ విపరీతంగా పెరిగింది. వెంటనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇదివరకే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు సిద్దు. తాను హీరోగా సినిమా చేస్తున్నాడు అంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అందరు ఊహించారు. సిద్దు కూడా కథలు విషయంలో పర్టికులర్ గా ఉంటాడు కాబట్టి అందరూ ఈ సినిమాని బ్లైండ్ గా నమ్మారు. కానీ థియేటర్లో చూసిన ఆడియన్ కి కూడా ఈ సినిమా క్రాక్ ఎక్కించింది. ఇక ప్రస్తుతం సిద్దు తెలుసు కదా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.
తెలుసు కదా ఎక్కడ జరుగుతుంది అంటే
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తెలుసు కదా. ఈ సినిమాతో నీరజకోన దర్శకురాలుగా పరిచయమవుతున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ వీడియో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సిద్దు లుక్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ బాచుపల్లి లో జరుగుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. ఈ సినిమాతో సిద్దు కం బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
Also Read : Sailesh Kolanu : ఏది రాస్తే అది జరుగుతుంది ఏంటి బాసు.?