Pahalgam Terror Affect: నాయకుడు అనేవాడు ఎన్నికష్టాలు వచ్చినా ప్రత్యర్థులకు ఎదురొడ్డి పోరాడాలి. అప్పుడు అతడ్ని ప్రజలు గుర్తిస్తారు. బాహుబలిలో కాలకేయుడి సైన్యం దాటికి మహిష్మతి సైన్యం వెనుకడుగు వేస్తుంది. ఆ సమయంలో వారికి ధైర్యాన్ని నూరిపోస్తాడు బాహుబలి. ఇదంతా రీల్. రియల్ విషయానికి వద్దాం. దాయాది దేశం పాకిస్థాన్ తీరు ఇందుకు వేరు. పహల్‌గామ్ దాడి తర్వాత తొలి రోజు మాట్లాడిన ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో టూరిస్టులపై ఉగ్ర దాడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. దీనివల్ల అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌లో ఉంటున్న పాక్ జాతీయులు దేశం విడిచి వెళ్లాలని మోదీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన పరిణమాలు జరుగుతున్నాయి.
పహల్‌గామ్ ఘటన తర్వాత మీడియా ముందుకొచ్చిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఆయన చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. నలుగురితో చప్పట్లు కొట్టించు కున్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదేశంలో ఆయన కనిపించలేదనే వార్తలు జోరందుకున్నాయి.
లండన్‌కు పరార్
దాడి ఘటన తర్వాత భారత్ నుంచి ఎదురుదాడి జరగవచ్చని భావించిన ఆర్మీ చీఫ్ అసిమ్, ఫ్యామిలీతో కలసి లండన్ లేదా అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆయన ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ముందు ఎదురు నిలవడం కష్టమని భావించి ఆయన దేశం విడిచినట్టు చెబుతున్నారు.
ALSO READ: పాక్‌లో మందుల కొరత, పిట్టల్లా రాలిపోతున్న జనం
ఇక భారత్ విషయానికొద్దాం.. పహల్‌గామ్ దాడి జరిగిన మరుసటి రోజు జమ్మూకాశ్మీర్‌లో ఇండియా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. అక్కడి వవిధ భద్రతా దళాల కీలకమైన అధికారులతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలు తెలుసుకున్నారు, ప్రత్యర్థులను ఎలా ఎదురించాలో చెప్పారు కూడా. అదేరోజు కీలక ఉగ్రవాద నాయకుడ్ని భద్రతబలగాలు మట్టుబెట్టాయి కూడా. ఇదీ నాయకుడి లక్షణమని అంటున్నారు.
పాక్‌లో నిరసనలు
పహల్‌గామ్ ఉగ్ర దాడి వెనుక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ ప్రమేయం ఉంటుందంటూ ఆరోపణలు ఆదేశంలో వెల్లువెత్తున్నాయి. సొంత దేశ ప్రజల నుంచి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ద్వారా పాకిస్థాన్ అంతర్గత రాజకీయాల్లో సైన్యం జోక్యం ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఎక్స్ వేదికగా ఆసిమ్‌పై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
పహల్‌గామ్ ఘటన తర్వాత లక్షలాది మంది ప్రజలు తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు. అసిమ్ మునీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదేశ సైనిక వ్యాపారాలను బహిష్కరించాలంటూ హ్యాష్ ట్యాగ్‌లు ఎక్స్‌లో హోరెత్తాయి. ఆయన్ని వెంటనే ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు లేకపోలేదు. మునీర్‌ను తొలగించండి.. ఇమ్రాన్‌ను విడుదల చేయాలంటూ యూజర్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.
నార్మల్‌గా పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదని చాలామంది నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. పాలకులు ఎవరు వచ్చినా అంతా సైన్యం చేతిలో కీలుబొమ్మగా మార్చాల్సిందే. గతంలో జరిగిన ఉదంతాలను కొంతమంది రక్షణ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి సమన్వయం పాటించాల్సిన ఆ దేశ ఆర్మీ చీఫ్ పత్తా లేకుండా పోయారని అంటున్నారు.