Sailesh Kolanu : కొన్నిసార్లు కొన్ని సంఘటన ఊహించిన విధంగా జరుగుతూ ఉంటాయి. అవి వింటున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అలానే కొన్ని సినిమాల్లో కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన రిపీట్ అనే సినిమాలో ఒక రచయిత తాను రాసుకున్న పాత్రలన్నీ నిజ జీవితంలో తారసపడుతూ ఉంటాయి. అలానే అరవింద్ అనే ఒక సినిమాలో ఒక డైరీలో సంఘటన నన్ను నిజమవుతుంటాయి. ఇక ప్రస్తుతం దాదాపుగా అలాంటి పరిణామాలే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో శైలేష్ కొలను కు ఎదురవుతున్నాయి. హిట్ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా నాని నిర్మించాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా హిట్ 3 మే 1న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే రిలీజ్ అయిన హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా ఇది ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఏది రాస్తే అదే జరుగుతుంది
హిట్ సినిమా రిలీజ్ కంటే ముందు తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో దిశా సంఘటన తెలంగాణ ప్రాంతాన్నే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేసింది. అయితే సరిగ్గా అలాంటి కథనే రాసి సినిమా కూడా తీసేసాడు దర్శకుడు శైలేష్ కొలను. ఈ సినిమా వచ్చినప్పుడు కూడా తాను భయపడిపోయి నానికి, విశ్వక్సేన్ కాల్ చేశాడు. అయితే వాళ్ళిద్దరూ నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు పోస్ట్ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు అని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత హిట్ 2 రిలీజ్ కు ముందు కూడా దాదాపు అలాంటి కేసే ఒకటి వార్తల్లోకి వచ్చింది అప్పుడు కూడా శైలేష్ భయపడ్డాడు. రెండుసార్లు జరగడం మామూలు విషయమే. కానీ ఇప్పుడు మూడోసారి కూడా అలానే జరిగింది. హిట్ 3 సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పెహల్గామ్ దాడి కూడా యావత్ భారతదేశాన్ని కలచి వేసింది. అయితే యాదృచ్ఛికంగా హిట్ 3 సినిమాలో ఇలాంటి దాడికి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. దీనిని బట్టి సోషల్ మీడియాలో దర్శకుడుని ప్రతిసారి అలా ఎలా జరుగుతుంది అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
యాక్షన్ లవర్స్ కోసం
నాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్యకాలంలో వరుస హిట్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు. అలానే తాను నిర్మాతగా చాలామంది దర్శకులను పరిచయం చేస్తున్నాడు. నాని ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేయడంతో పాటు, మరోపక్క క్లాస్ మూవీస్ కూడా అటెంప్ట్ చేస్తున్నాడు. అయితే యాక్షన్ మూవీ ని కోరుకుని ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. అలానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విపరీతమైన అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో మే 1న తెలియనుంది.
Also Read : Suriya: నేను ఈ సినిమా కోసమే సిగరెట్ తాగాను, దయచేసి లైఫ్ లో మీరు ముట్టుకోవద్దు