BigTV English

HBD Samantha: సేల్స్ గర్ల్ నుండీ నిర్మాత వరకూ.. సక్సెస్ వెనక ఎన్నో అవమానాలు, హేళనలు..!

HBD Samantha: సేల్స్ గర్ల్ నుండీ నిర్మాత వరకూ.. సక్సెస్ వెనక ఎన్నో అవమానాలు, హేళనలు..!

HBD Samantha..సమంత (Samantha).. కుర్రకారు క్రష్ గా మారిపోయిన సమంత… జోసెఫ్ ప్రభు, నినిట్టే ప్రభు దంపతులకు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించింది. ఈమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్ కాగా.. తల్లి సిరియన్ మలయాళీ.చదువుకునే సమయంలోనే పాకెట్ మనీ కోసం సొంతంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేసిన సమంత.. అందులో భాగంగానే ఒక బట్టల కంపెనీతో కలిసి సేల్స్ గర్ల్ గా పనిచేసినట్లు గతంలో వార్తలు వినిపించాయి. అలా పనిచేస్తున్న సమయంలో ఒక నిర్మాత ఈమెను చూసి హీరోయిన్ గా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సమంత ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.


కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలు చేసిన సమంత..

అలా మొదట ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. హీరోలకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా వాళ్లతో పోటీ పడుతూ.. సరి సమానంగా దూసుకుపోతున్న ఏకైక హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది సమంత. ఇక ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ తనదైన నటనతో తానేంటో నిరూపించుకొని ఇప్పటికీ తన తర్వాతే ఎవరైనా అని నిరూపించుకుంటుంది సమంత. ఈరోజు ఆమె పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె గురించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సమంత వృత్తిపరమైన జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకుంది కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది అని చెప్పవచ్చు.


వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవమానాలు..

సమంత తన తొలి సినిమా ‘ ఏ మాయ చేసావే’ సినిమాలో నటిస్తున్నప్పుడు అదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇక ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత సంతోషంగా ఉండాల్సిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక విడాకుల తర్వాత ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొంది సమంత. చాలామంది ఈమెపై నిందలు కూడా వేశారు. అయిన వాటన్నింటిని ఎదురించి నిలదొక్కుకింది. అదే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. దీనికి తోడు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ.. వరుస వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుండగా మరొకవైపు ట్రాలాలా అనే మూవింగ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత ఇప్పుడు శుభం అనే సినిమాను నిర్మిస్తోంది. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏదేమైనా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు నిర్మాతగా సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతోంది సమంత. ఇక ఈరోజు పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×