VD12: లైగర్ సినిమాతో మొదలైన విజయ్ దేవరకొండ ప్లాపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో విజయ్ ఆశలన్నీ VD12 మీదనే పెట్టుకున్నాడు.
జెర్సీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో విజయ్ రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి పోలీస్ గా.. ఇంకొకటి ఖైదీగా. ఈ రెండు లుక్స్ లో ఖైదీ లుక్ రిలీజ్ చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే ఎప్పటినుంచో ఈ సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఎప్పుడెప్పుడు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తారా.. ? అని అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసేశారు. ఫిబ్రవరి 12 న VD12 టైటిల్ తో పాటుటీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో పాటు మరో అద్భుతమైన విషయాన్నీ కూడా మేకర్స్ తెలిపారు.
Boycott Laila: విశ్వక్.. దమ్ముంటే పృథ్వీతో క్షమాపణలు చెప్పించు.. ?
గత వారం నుంచి VD12 కోసం స్టార్ హీరోస్ రంగంలోకి దిగుతున్నారు అని పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తెలుగులో ఒక స్టార్ హీరో.. తమిళ్ లో ఒక స్టార్ హీరో.. ఇలా ప్రతి భాషలో ఒక స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారు. ఇక తాజాగా తమిళ్ టీజర్ కు సూర్య వాయిస్ ఇస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
“తన సింహాసనాన్ని క్లెయిమ్ చేయడానికి ఉద్దేశించిన రాజు యొక్క కథకు మరొక శక్తి అదనంగా తోడైంది. VD12 తమిళ్ టీజర్ కు సూర్య వాయిస్ ను అందించడం ఆనందంగా ఉంది. థాంక్యూ సూర్య” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ నాగవంశీ.. ” థాంక్యూ సూర్యగారు.. మా చిత్రబృందానికి మీరు చేసింది మేము మర్చిపోలేం. ఎమోషన్స్ పంచడంలో మీరు అగ్గి రాజేశారు. ఫిబ్రవరి 12న అవి పేలిపోయే వరకు మేము వేచి ఉండలేము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.
తమిళ్ లో సూర్య అయితే తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు అని టాక్ నడుస్తోంది. తెలుగు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే తమిళ్ లో విజయ్ యాక్టింగ్.. సూర్య వాయిస్. నెక్ట్స్ లెవెల్ ఉండబోతుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా రౌడీ హీరో మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
For the tale of a KING destined to claim his throne comes a mighty addition ❤️🔥❤️🔥
The supremo @Suriya_offl lends his voice to the #VD12 Tamil Teaser! 💥💥
Get ready for Feb 12th!! 🔥🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/qAL8bpXquc
— Sithara Entertainments (@SitharaEnts) February 10, 2025