AP Liquor Rates: మందుబాబులకు బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మద్యం ధరలు పెరుగుతాయన్న వార్తలు గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కేబినెట్ లో కూడ మద్యం ధరల పెంపుపై నిర్ణయం కూడ తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా మద్యం ధరలు పెరగడంతో, మందుబాబులకు షాకిచ్చే న్యూస్ గా చెప్పవచ్చు.
ఏపీలో కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానంను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే, మందుబాబులకు అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు ఎవరైనా ఎమ్మార్పీ రేటు కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కూడ హెచ్చరించారు, అంతేకాదు రూ. 99 లకే మద్యం బాటిల్ అందుబాటులోకి తీసుకువస్తామన్న హామీని కూడ ప్రభుత్వం నెరవేర్చింది. మందు బాబులకు కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని చెప్పవచ్చు.
కాగా నూతన మద్యం విధానం ద్వార సుమారు 3500 కు పైగా, దుకాణాలు ఉన్నాయి. దుకానదారుల ఎంపికకు లాటరీ పద్దతి ద్వార పారాదర్శకంగా ఎంపిక సాగింది. అయితే మద్యం షాపులు ప్రారంభించిన కొద్ది నెలలకే షాపులు దక్కించుకున్నవారు తమ నిరసన గళమెత్తారు. తమకు ఇస్తామన్న మార్జిన్ ఇవ్వకుండ, తక్కువ మార్జిన్ ఇస్తున్నారని వ్యాపారస్తులు లబోదిబో మన్నారు. అంతేకాదు ఎక్సైజ్ అధికారులకు కూడ వినతిపత్రం అందజేశారు. పలు సమావేశాలు నిర్వహించి తమ ఉద్దేశాన్ని ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు.
Also Read: Viral News: పెళ్లాం పుట్టింటికి వెళ్లిందని.. ఈ భర్త చేసిన సంబరాలకు అందరూ షాక్..
దీనితో ప్రభుత్వం కాస్తైనా దుకానదారులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంది. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకోగా, మొత్తం మూడు కేటగిరీలుగా మద్యం సరఫరాను విభజించారు. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్ లుగా విభజించి రూ. 99 లకే క్వార్టర్ బాటిల్ ధరను ఏ మాత్రం పెంచలేదు. అలాగే బీర్ల ధరలను కూడ పెంచకుండా, మిగిలిన బ్రాండ్ మద్యం ధరలను పెంచింది ప్రభుత్వం. ఇప్పటి నుండి మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచినట్లుగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇలా ధరలు పెంచడం లైసెన్స్ దారులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.