Manchu Mohan Babu : తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట ఆస్తి కోసం కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ పై దాడి చేయించారని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆస్తి గొడవలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు రోజులుగా వీరి గొడవలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక తాజాగా మోహన్ బాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత మోహన్ బాబు కూడా పోలీసులకు తన వర్షన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..ఇక సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా పై దాడి చేసాడు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇక తాజాగా ఆయన చేతిలో దెబ్బలు తిన్న ఒక్కొక్కరు బయటకు వస్తూ మోహన్ బాబు అరాచకాలను బయటపెడుతున్నారు. అసలేం జరుగుతుందని జనాలు ఆలోచనలో పడ్డారు.
మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
మంచు వారి ఇంట వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే.. ఎన్నడూ లేనిది మనోజ్ ఇంతలా మారిపోయాడేంటి..? అసలు నిజంగానే ఆస్తి గొడవలు ఉన్నాయా? మౌనికను పెళ్లి చేసుకోవడం వల్లే మనోజ్ ను దూరం పెట్టాడా? విద్యానికేతన్ విద్యా సంస్థల్లో నిజంగానే అవకతవకలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు జనాలకు రావడం సహజం.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవి నిజం అని తెలుస్తుంది. ఈ వివాదం పై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు మంచు మనోజ్, విష్ణులను విచారణకు రావాలని కోరారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని సమాచారం.. వీరిద్దరీ మధ్య సంధి కుదురుస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
బయటకు వస్తున్న మోహన్ బాబు అరాచకాలు..
మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుతున్న విషయం తెలిసిందే.. కుటుంబ కలహాలు కాస్త రోడ్డెక్కడంతో పరిస్థితులు చేజారిపోయాయి. నిన్న కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధిపై కూడా మోహనబాబు చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో సదరు మీడియా ప్రతినిధి తలకు ఫ్రాక్చర్ అయినట్లు చెబుతున్నారు. కన్ను, చెవుకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు సదరు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇక మోహనబాబు మానసిక పరిస్థితి ఏమైంది? ఎలా ఉంది? అని అంత అనుకుంటున్నారు. ఇలాంటి ఓ పెద్ద స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. ఇకపోతే ఆయనతో దెబ్బలు తిన్న ఒక్కొక్కరు బయటకు వచ్చి ఆయన పై ఫిర్యాదులు చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అనేక మంది పై మోహన్ బాబు చెయ్యి చేసుకున్నట్లు తెలుస్తుంది. మోహన్ బాబు కు నిలువెల్లా అహంకారం, ఇష్టానుసారంగా బూతు పురాణం, మీడియా ప్రతినిధులపై దాడి అనంతరం ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి మోహన్ బాబు అరాచకాలు… తిరుపతిలోని తన విద్యా సంస్థలో అనేకమంది ప్రొఫెసర్ల పై చేయి చేసుకున్నారని, మీడియా ఫై జరిగిన దాడి చూసి మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బాధితులు సమాచారం ఇస్తున్నారు. ఈ విషయాలను చూస్తుంటే మోహన్ బాబు మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకొనేలా ఉందని అర్థమవుతుంది.. మరి ఏం జరుగుతుందో చూడాలి..