Manchu Manoj : నిన్న రాత్రి మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర జరిగిన హడావుడి ఇంకా తగ్గలేదు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడంతో ఈ రోజు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. మోహన్ బాబు ఫాం హౌస్ దగ్గర మోహన్ బాబుకు వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. అయితే అదే టైంలో పోలీసుల విచారణ కోసం మంచు మనోజ్ బయటికి వచ్చారు. నేరుగా ఆందోళన చేస్తున్న మీడియా ప్రతినిధుల వద్దకు చేరుకుని ఆయన మద్దతు ప్రకటించారు. మీడియాపై దాడి బాధాకరం అంటూ సంఘీభావం ప్రకటించారు.
నాన్న సారీ చెప్పాలి…
తనకు సపొర్ట్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ లకు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం తప్పే అని, తన తండ్రి మోహన్ బాబు చేసిందే తప్పే అని అన్నాడు. అంతే కాకుండా, మీడియా జర్నలిస్ట్ దాడి చేసి తప్పు చేసిన తన మోహన్ బాబు ఫాం హౌస్ నుంచి బయటికి వచ్చి క్షమాపణలు చెప్పాలని మంచు మనోజ్ డిమాండ్ చేశాడు. మంచు మోహన్ బాబు ఫాం హౌస్ గేట్ దగ్గరే కూర్చుని మోహన్ బాబు బయటికి రావాలని చెప్పాలని డిమాండ్ చేశారు.
నేను ఆస్తి అడగలేదు…
“నేను కానీ, నా భార్య కానీ ఎప్పుడూ ఆస్తి, డబ్బులు అడగలేదు. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పటి వరకు అన్ని అనుభవించా.. ఇక ఆగలేను. అలాగే రాత్రి అమ్మ ఆస్పత్రిలో ఉంది అంటూ రాత్రి అబద్దాలు చెబుతున్నారు. నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా భార్య పేరును లాగుతున్నారు. నా పిల్లలను లాగుతున్నారు” అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు.
ప్రేమించుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా…?
“నేను చేసిన తప్పు ఏం లేదు. ఎంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంతే. అదే చేసినా తప్పా.. నా కోసం మౌనిక వచ్చింది. వాళ్ల ఇంటి నుంచి డబ్బులు ఏం తీసుకురాలేదు. ఆమె కోసం నేను నిలబడ్డాను. అది వాళ్లకు నచ్చలేదు. అన్న కంపెనీల్లో పని చేశాను. వాళ్ల కోసం పని చేశాను. పాటలు చేశాను. వాళ్ల సినిమాల్లో చేశాను. డైరెక్షన్ చేశాను. ఎప్పుడూ డబ్బులు అడగలేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్.
నేడు పోలీసుల ముందుకు మనోజ్…
నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఫాం హౌస్ లో జరిగిన హడావుడిపై పోలీసులు సీరియస్ అయ్యారు. రాత్రే మంచు ఫ్యామిలీలోనే… మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో నేడు ఉదయం 10:30 గంటలకు పోలీస్ కమిషనరేట్ వద్ద హజరు కావాల్సింది. తాజాగా మంచు మనోజ్ కూడా కమిషనరేట్ దగ్గరకు స్టార్ట్ అయ్యారు. మోహన్ బాబు మనుషులు దాడి చేయడం వల్ల తనకు చాలా గాయాలు అయ్యాయని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్పానని, కాస్త సెట్ చేసుకుని కాస్త ఆలస్యంగా విచారణకు వస్తానని పోలీసులకు మంచు మనోజ్ చెప్పారట.