BigTV English

The village : వెన్నులో వణుకు పుట్టించే ఈ హార్రర్‌ థ్రిల్లర్‌.. ఓటీటీ చూసే డేర్ ఉందా..

The village : వెన్నులో వణుకు పుట్టించే ఈ హార్రర్‌ థ్రిల్లర్‌.. ఓటీటీ చూసే డేర్ ఉందా..
The village

The village : ఓటీటీలో సినిమాలు చూడడానికి ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ అవుతున్నారు అందుకే ఓటేటి సంస్థలు కూడా ప్రతివారం ఏదో ఒక  కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లతో సందడి చేస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీ లోకి విడుదలైన వెబ్ సిరీస్..హారర్ థ్రిల్లర్ ది విలేజ్ ప్రేక్షకులను భయంతో వణికిస్తోంది.


ప్రస్తుతం థియేటర్లలో కంటే కూడా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లోకి వచ్చి తెగ హడావిడి చేస్తున్నాయి. చాలామంది స్టార్ హీరోలు వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదే నేపథ్యంలో  ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ లో తొలిసారిగా తమిళ్ హీరో ఆర్య ఈ వెబ్ సిరీస్లో నటించాడు.ఈ హారర్ మూవీ ఒంటరిగా చూడాలంటే భయం పుట్టిస్తుంది మరి. ఇంతకీ మూవీ కథ ఏంటి? అంతగా వణికిస్తున్న ఆ కాన్సెప్ట్ ఏంటో ఓ లుక్ వేదం పదండి.

ఓటీటీ లో ప్రేక్షకులు ఎక్కువగా హారర్ ,థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా సినీ లవర్స్ ని సాటిస్ఫై చేయడం కోసం ఎక్కువగా ఇటువంటి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్, మూవీస్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గత నెలలో వచ్చిన అతిథి, మ్యాన్షన్‌ 24 లాంటి వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు ఇదే కోవలో మాంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ హారర్ మూవీ భయంతో వణుకు పుట్టిస్తోంది.


ఇప్పటికే ద విలేజ్ నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను ఒకపక్క భయపెడుతూనే.. ఒకపక్క ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ నవంబర్ 24 అర్ధరాత్రి ను ఓటీటీ లో విడుదల చేశారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం

అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఇది అవైలబుల్ గా ఉంది.

ప్రస్తుతం ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక కథ విషయానికి వస్తే.. అనుకోకుండా హీరోతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అడవిలో చిక్కుకుంటారు. అయితే పక్కనే ఉన్న విలేజ్లో షెల్టర్ కోసం వెళ్తారు. అక్కడ వారికి కొంతమంది ఎదురుపడతారు. ఊహించని విధంగా కొన్ని అతీంద్రియ శక్తులు హీరో భార్యా పిల్లలను ఎత్తుకు పోతాయి. ఇక వారి నుంచి హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఆ విలేజ్ లో ఉన్న అతీంద్రియ శక్తులు ఏమి ఆశిస్తున్నాయి? తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×