E-Paper
Advertisement

ORR Accident : ఓఆర్ఆర్ పై ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం

ORR Accident : ఓఆర్ఆర్ పై ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం
Advertisement
ORR Accident

ORR Accident : హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ పై ప్రమాదం జరిగింది. ఆదిభట్ల దగ్గర కారులో మంటలు ఎగిసిపడి వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కారు కోదాడ చెందిన వ్యక్తిగా గుర్తించారు. కోదాడ చెందిన వెంకటేష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు.. కారు నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంకటేష్ నిన్న సాయంత్రం కోదాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు.

ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కార్ నిలిపి ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో అందులోనే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కారును ఎవరైనా తగలబెట్టారా లేక ప్రమాదవశాత్తు తగలబడిందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రమాద ఘటనపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మృతుడిని పోస్టుమార్టమ్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×