BigTV English

IPL 2024 : ఐపీఎల్ 2024.. కొత్తవారిపై మోజు

IPL 2024 : ఐపీఎల్ 2024.. కొత్తవారిపై మోజు
IPL 2024 14

IPL 2024 : 2023లో రూ.50 లక్షలకి కూడా అమ్ముడుపోని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మధుశంక వన్డే ప్రపంచకప్‌ 2023లో రాణించిన క్రీడాకారులపై ఫ్రాంచైజీలు ద్రష్టి పెట్టాయి. వివిధ విభాగాల్లో టాప్ 10లో ఉన్న ఆటగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదులు కోకూడదని నిర్ణయించుకున్నాయి. వారిలో బౌలర్స్ లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక ఉన్నాడు.
తను వరల్డ్ కప్ లో 9 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీసుకున్నాడు. దురద్రష్టం ఏమిటంటే ఐపీఎల్ 2023లో రూ.50 లక్షలకి కూడా ఎవరూ కొనుక్కోలేదు.


మరి ఫ్రాంచైజీలు దిల్షాన్ మధుశంకలోని బౌలర్ ని గుర్తించలేదా? అందరిలాగే వీరు కూడా పైపై మెరుగులే చూస్తున్నారా? ఆ ఆటగాడి పూర్వాపరాలు తెలుసుకోవడం లేదా? మరి ఫ్రాంచైజీల దగ్గర మెంటర్లు, కోచ్ లు, ఎయిర్ పోర్టులో ఏరోప్లెయిన్ దగ్గర ఉన్నట్టు అంతమంది ఉండి కూడా మధుశంకలోని గొప్పతనాన్ని ఒక్కరూ గుర్తించలేదా? ఇది నిజంగా దురద్రష్టం అనే చెప్పాలి.

పదికి పది ఫ్రాంచైజీల పరిస్థితి అలాగే ఉండటం దారుణమని అంటున్నారు. అంటే ఐపీఎల్ అంతా డబ్బుల కోసం జరిగే గేమ్ తప్ప, ఏమీలేదు. జనం వీక్ నెస్ ల మీద డిపెండ్ అయి, ఆడే ఆటని అందరూ తిడుతున్నారు.


 ఎక్కడో అట్టడుగున ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఐపీఎల్ ని పెట్టామని ఘనంగా చెప్పుకునే బీసీసీఐ ఆ లక్ష్యానికి దూరంగా వెళ్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఫ్రాంచైజీలు కూడా ఇక్కడ స్టార్ బౌలర్, స్టార్ బ్యాటర్ అయితేనే కొంటున్నారు. లేదంటే ఇంతేసంగతి అని చెబుతున్నారు.

అంతేకానీ యువకుల్లో ప్రతిభను వెలికి తీద్దామనే ఆలోచన లేకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈరోజున మధుశంక విషయంలో జరిగింది. రేపు మన ఇండియాలో కూడా జరుగుతుంది. అప్పుడు నిజమైన ఆటగాళ్లకి న్యాయం జరగదని అంటున్నారు.మళ్లీ ఆడాలి, మళ్లీ మళ్లీ ఆడాలి. పోరాడాలి, నిరూపించుకోవాలి…ఇక వర్థమాన క్రికెటర్ల పరిస్థితి ఇంతేనా అని ప్రశ్నిస్తున్నారు.

బౌలర్ గా మధుశంక కి డిమాండ్ పెరిగితే..బ్యాటింగ్ లోకి వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయానికి అడ్డంగా నిలబడిపోయిన ట్రావిస్ హెడ్ కి మంచి ధర పలికేలా ఉంది.

ఇక ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, రచిన్ రవీంద్ర, డారీ మిచెల్ వంటి ప్లేయర్లు వేలంలో అందుబాటులో ఉండనున్నారు. వీరికి భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 50 మంది ఆటగాళ్లను దుబాయ్ వేదికగా డిసెంబర్‌ 19న జరిగే వేలంలో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×