BigTV English

Vettaiyan : వెట్టయాన్‌ వేస్ట్ అయిపోయింది… డైరెక్టర్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది..

Vettaiyan : వెట్టయాన్‌ వేస్ట్ అయిపోయింది… డైరెక్టర్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది..

Vettaiyan Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వేట్టయాన్’. ఈ మూవీ ఇవాళ తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే రజనీకాంత్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకుంటుండగా, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు. అంతేకాకుండా ఈ సినిమాను తమిళ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు అనే వివాదం సినిమా అడ్వాన్స్ బుకింగ్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. ఫలితంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయాయి. పైగా సినిమాకు కంప్లీట్ గా యావరేజ్ టాక్ వస్తోంది. ఈ సినిమా మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకోవడంతో రజినీ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను టీమ్ రీచ్ అవ్వలేక పోయిందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ మూవీ నెగిటివ్ టాక్ ను అందుకోవడానికి కారణాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం..


‘వేట్టయాన్ ‘మూవీ మైనస్ పాయింట్స్..

జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్ : ది హంటర్’. ఈ మూవీ అక్టోబర్ 10న దసరా కానుకగా థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను దాదాపు రూ. 140 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది రజనీకాంత్ కు 170వ సినిమా. అయితే సినిమా రిలీజ్ కి ముందే పలు వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా నెగిటివిటీని కూడా తెచ్చుకుంది.


ఈ మూవీ నెగిటివ్ టాక్ ను అందుకోవడానికి కారణాలు ఏంటో చూస్తే.. ఈ మూవీ ఒక లైన్ మీదే తిరుగుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు క్యూరియాసిటిని కలిగించినా కూడా సెకండ్ ఆఫ్ మాత్రం బోరింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట, కొన్ని సీన్ల ల్యాగ్ సినిమాకు మైనస్ అయింది. ఎడిటింగ్ వర్క్ సరిగ్గా లేదనే టాక్ ను అందుకుంది. డైరెక్టర్ సినిమాను సరిగ్గా చూపించలేదనే టాక్ ను అందుకుంది. సాంగ్స్ వరకు సంగీతం బాగుంది. కానీ సినిమాకు మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా సెట్ కాలేదు అని టాక్ ను అందుకుంది. మొత్తానికి మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సన్ టివి 65 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ మూవీ మొత్తానికి రూ. 155 కోట్లవరకు బిజినెస్ జరిగిందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. రజనీకాంత్ కు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో వేటాయం సినిమాకు డీల్ కుదిరింది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో తప్పటడుగు వేసినట్టుగానే అనిపిస్తోంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. ఇక వీకెండ్ ఏమైనా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని టీమ్ ఆశ పడుతుంది. మొత్తానికి మూవీ ఎంత కలెక్ట్ చేసింది.. కాసేపట్లో తెలియనున్నాయి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×