Ntr : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు కూడా మల్టీస్టారర్ సినిమాలు బాగానే విడుదలయ్యాయి. శ్రీకాంత్ అడ్డాలో దర్శకత్వం వహించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత తెలుగులో మళ్లీ ఈ ట్రెండు మొదలైంది. అయితే హీరోల మధ్య పోటీతత్వం ఉండడం అనేది సహజంగానే జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో కొంతమంది యంగ్ హీరోస్ కలిసి ఉండటం చాలామంది అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ తగ్గిస్తుంది అని చెప్పాలి. అయితే కేవలం అలానే మాట్లాడుతారు పోటీ ఉంటూనే ఉంటుంది అని ఇప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్స్ భీభత్సంగా జరుగుతుంటాయి. పర్సనల్ ట్రోలింగ్ కూడా చేయడం చాలా మందికి అలవాటైపోయింది.
ఎన్టీఆర్ – కృష్ణ మధ్య పోటీ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామంది తనను అన్నగారు అని పిలుస్తారు. ఆయన నటించిన సినిమాలు అప్పట్లో సంచలమైన విజయాన్ని నమోదు చేస్తూ ఉండేవి. కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా కూడా చాలా సినిమాలు చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు. అయితే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇద్దరు కూడా అప్పట్లో పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు.
ఎన్టీఆర్ – కృష్ణ మధ్య గొడవ
ఇప్పుడు కొంచెం తక్కువగానే అప్పట్లో హీరోల మధ్య గొడవలు కూడా బాగానే జరుగుతుండేవి. ఒకరిని టార్గెట్ చేస్తూ ఒకరు సినిమాలు చేసేవాళ్ళు. ఒకే కథను ఇద్దరు కూడా మొదలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు దానవీరశూరకర్ణ సినిమా చేస్తున్నప్పుడు, సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా చేశారు. ఈ రెండింటి కదా దాదాపు ఒక్కటే మీరు చెయ్యొద్దు అని ఎన్టీఆర్ చెప్తే కృష్ణ ఆ మాటను పట్టించుకోకుండా కొంతమందిని ట్రైన్ లో రాజస్థాన్ కు తీసుకెళ్లి మరి షూటింగ్ చేశారు అని సమాచారం ఉంది. అలానే అల్లూరి సీతారామరాజు సినిమాను ఎన్టీఆర్ చేయడానికి సిద్ధమైన తరుణంలో, కృష్ణ సినిమాను అనౌన్స్ చేసి మన్యం వెళ్లిపోయి అక్కడ స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా చేసేసారు. ఈ రెండు సందర్భాలే వీరిద్దరి మధ్య దూరానికి కారణమని కొంతమంది సినిమా ప్రముఖులు తెలిపారు. ఇక ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్,మహేష్ బాబు ఎంత హుందాగా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిన విషయమే. మహేష్ బాబుని ఎన్టీఆర్ అన్నా అని పిలుస్తూ ఉంటారు.
Also Read: Pawan Kalyan: నాకు సూర్యకు మధ్య గొడవ జరిగింది