BigTV English

Chenab Rail Bridge: తొలి కాశ్మీర్ కు రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జికి మోడీ పచ్చ జెండా!

Chenab Rail Bridge: తొలి కాశ్మీర్ కు రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జికి మోడీ పచ్చ జెండా!

Jammu Kashmir Vande Bharat Express: భారతీయ రైల్వేలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. దశాబ్దాలుగా కాశ్మీర్ ప్రజలు ఎదురుచూస్తున్న రైలు ప్రారంభం అయ్యింది. తొలి కాశ్మీర్ రైలుకు, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోడీ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్‌ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి రూ.46,000 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి,’ఆపరేషన్ సిందూర్’ తర్వాత ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లో తొలిసారి పర్యటించడం విశేషం.


చీనాబ్ వంతెన, కాశ్మీర్ వందేభారత్ రైళ్లు ప్రారంభం

జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ముందుగా  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోనే తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి అయిన అంజిఖాడ్ వంతెనను పరిశీలించారు. ఆ తర్వాత  నేరుగా కాశ్మీర్ కు వెళ్లే  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ కొత్త సెమీ-హై-స్పీడ్ రైళ్లు ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ద్వారా జమ్మూకాశ్మీర్ కత్రా నుంచి శ్రీనగర్ వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి .


ఇంజినీరింగ్ అద్భుతం చీనాబ్ వంతెన

చీనాబ్ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో, పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించారు. 1,315 మీటర్ల పొడవైన స్టీల్ ఆర్చ్ వంతెన  తీవ్రమైన భూకంపాలు, బలమైన గాలులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. ఈ వంతెన USBRL ప్రాజెక్ట్‌లో కీలకమైన భాగం. ఇది  దేశంలో అత్యంత సవాలుతో కూడిన, ప్రతిష్టాత్మకమైన రైల్వే ప్రాజెక్టులలో ఒకటిగా పరిగణించబడే 272 కి.మీ రైల్వే లైన్ లో భాగంగా ఉంది. “ఈ వంతెన జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మార్గం ద్వారా కత్రా- శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గనుంది. ప్రయాణీకులు అత్యాధునిక వందేభారత్ రైలు ద్వారా వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

కాశ్మీర్ పర్యాటకానికి మరింత బూస్టింగ్

ఇక కత్రా-శ్రీనగర్ వందే భారత్ రైళ్ల ప్రారంభంతో ఆ ప్రాంతంలో పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఊపునివ్వనుంది. వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన రైలు సదుపాయంతో, యాత్రికులు, పర్యాటకులు, స్థానికులు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

Read Also: 2 జతల రైళ్లు, వారానికి 6 రోజులు.. కాశ్మీర్ వందేభారత్ రైళ్ల టైమింగ్స్ ఇవే!

రూ. 46 వేల కోట్లతో కీలక అభివృద్ధి పనులు

రూ.46,000 కోట్ల అభివృద్ధి ప్యాకేజీలోజమ్మూ కాశ్మీర్‌లో మౌలిక సదుపాయాలు, రోడ్డు, రైలు కనెక్టివిటీ, ఇంధన సదుపాయం, విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చేయనున్నాయి.  ప్రధాని మోడీ ప్రారంభించిన పలు కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్‌లో శాంతి, పురోగతి, శ్రేయస్సుకు ఉపయోగపడనున్నాయి.

Read Also:  బుల్లెట్ ట్రైన్ బిగ్ అప్ డేట్, 12 స్టేషన్లతో రూట్ మ్యాప్ వచ్చేసింది!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×