Top-10 Highest Remuneration:ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోకి మంచి కథ దొరికి, ఆ కథతో సక్సెస్ కొట్టాడు అంటే అమాంతం రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. దాంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తారు. ప్రస్తుతం మన హీరోలు కూడా సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచేస్తూ, అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న హీరోలలో అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న హీరోల గురించి ఇప్పుడు చూద్దాం..
అల్లు అర్జున్ (Allu Arjun):
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ -10 హీరోల జాబితాలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్ల పారితోషకం తీసుకొని నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
విజయ్ దళపతి (Vijay thalapathy):
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’, ‘లియో’ వంటి చిత్రాలకు రూ.200 కోట్లు తీసుకున్నప్పటికీ రాబోయే తన 69వ చిత్రానికి ఏకంగా రూ.275 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.
షారుక్ ఖాన్ (Sharukh kha ):
బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ డంకీ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
రజినీకాంత్ (Rajinikanth):
కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ (Rajinikanth) ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఏడుపదుల వయసులో కూడా సినిమాలు చేస్తూ పోటీ ఇస్తున్నారు అంటే ఇక ఆయనకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈయన ఇటీవల నటించిన వేట్టయాన్ సినిమా కోసం రూ.250 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
అమీర్ ఖాన్ (Aamir Khan ):
బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా పేరు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ కూడా ఈమధ్య రూ .100 నుంచి రూ.200 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.
ప్రభాస్ (Prabhas):
రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలిసింది.
అజిత్ (Ajith):
కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అజిత్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.160 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ (Salman Khan):
బాలీవుడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటున్నారట.
కమల్ హాసన్ (Kamal Hassan):
కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ విశ్వనటుడి గా కూడా పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఒక్కో చిత్రానికి రూ.100 నుండి రూ.150 కోట్లు తీసుకుంటున్నారు.
అక్షయ్ కుమార్ (Akshay Kumar):
బాలీవుడ్ హీరోగా పేరు దక్కించుకున్న అక్షయ్ కుమార్ కూడా ఒక్కో చిత్రానికి రూ.60 నుండి రూ.140 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.