సోమశిల, కండలేరు జలాశయాలకు వరద పోటెత్తింది. ఇక జిల్లాలో కొన్నిచోట్ల వాగులు, వంకలు, డ్రైన్లు పొంగుపోతున్నాయి. కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల నాముడులు, నాట్లు నీటమునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నాయి. మరోవైపు వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లోని 11 వేల 157 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 10 వేల 426 ఎకరాలు వరి, 501 ఎకరాలు వేరు శనగ, 180 ఎకరాల్లో మినుము ఉన్నట్లు పేర్కొంది. కృష్ణా జిల్లాలో వర్షాలు, గాలుల ధాటికి 19,500 ఎకరాల్లో వరి నేలవాలినట్లు తెలుస్తోంది.
Also Read: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఆ జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు
తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఫెంగల్ తుపాను క్రమంగా బలహీనపడి, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మరోవైపు తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. తుఫాన్ ఎఫెక్ట్ తో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో కాకినాడ, కోనసీమ, పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.
తుఫాన్ కారణంగా ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో నిన్న ఏపీలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురవడంతో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి.