Sankranti movie’s:ఈ సంక్రాంతి చాలామంది సెలబ్రిటీలకు కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. అటు హీరోలకే కాదు హీరోయిన్ల కి కూడా సంక్రాంతి అనేది టఫ్ ఎగ్జామ్ గా మారబోతోంది. ఇప్పటికే బిజీగా సినిమాలు చేస్తున్న చాలామంది హీరోయిన్స్ తెలుగులో క్రేజ్ ఉన్నా.. స్టార్ హోదా మాత్రం అందుకోలేకపోయారు. ఇకపోతే ఈ సంక్రాంతి కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ(Kiara advani)మొదలు.. తెలుగు హీరోయిన్స్ అయిన అంజలి(Anjali), ఐశ్వర్యరాజేష్ (Aishwarya Rajesh) వరకు చాలామంది హీరోయిన్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి టాలీవుడ్ లో తమ కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది అని కోటి ఆశలతో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్ ని బట్టి.. వీరికి తెలుగులో ఎలాంటి కెరియర్ ఉండబోతోంది అనే విషయం తేలనుంది.
మరి ఈ సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదట గేమ్ ఛేంజర్(Game Changer).. జనవరి 10వ తేదీన రాబోతున్న ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అందులో అప్పన్న క్యారెక్టర్ కి అంజలి(Anjali),మరొక యంగ్ వర్షన్ కి కియారా జోడీగా నటిస్తున్నారు. ఈ హీరోయిన్లు ఇద్దరికీ కూడా ఈ సినిమా చాలా క్రూషియల్ గా మారింది. ఎందుకంటే అంజలి ఎప్పటినుంచో తెలుగు సినిమాలలో ఉన్నా.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఈ సినిమాతో కచ్చితంగా గుర్తింపు వస్తుందని ఎదురుచూస్తోంది. మరొకవైపు శంకర్ అయితే ఏకంగా అంజలికి నేషనల్ అవార్డు వస్తుందని కూడా చెప్పారు. మరి ఈ రేంజ్ యాక్టింగ్ చేసిన అంజలికి మళ్ళీ తెలుగులో అవకాశాలు రావాలంటే మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే. అలాగే ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న కియారా అద్వానీ కూడా 2019లో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ తెలుగులో ఆమె సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ హిట్టయితే తన అదృష్టం మళ్ళీ మారుతుందని ఎదురుచూస్తోంది.
ఇక “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh),మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరిలో మీనాక్షి చౌదరి గత ఆరు సినిమాలు రిలీజ్ చేసింది. అందులో అన్ని హిట్ సినిమాలు.. అయితే హిట్టు వచ్చినా స్టార్ హోదా రావట్లేదు. ఇక మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఇందులో వెంకటేష్(Venkatesh) భార్యగా నటిస్తోంది. స్టార్ హీరో పక్కన, అందులో మంచి సీజన్, భారీ అంచనాలు ఉన్న సినిమా కాబట్టి హిట్ అవుతుందని అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ఐశ్వర్య కూడా బిజీ అవడం ఖాయం.
ఇక మరొక చిత్రం బాలయ్య “డాకు మహారాజ్” ఇందులో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha shrinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకవైపు శ్రద్ధ అడపాదడపా తెలుగు సినిమాలలో నటిస్తున్నా.. స్టార్ హోదా దక్కించుకోలేదు. ఇక ప్రగ్యా జైస్వాల్ స్టార్ హీరోయిన్ కాదు కదా కనీసం వరుసగా తెలుగులో ఆఫర్లు కూడా రావట్లేదు. అందుకే వీరంతా కూడా సంక్రాంతి వైపు ఆశగా చూస్తున్నారు. మరి ఈ హీరోయిన్స్ కి సంక్రాంతి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.