Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మేకర్స్ కోట్లు కుమ్మరిస్తున్నట్టుగా తెలుస్తోంది. పైగా ఇలా వీఎఫ్ఎక్స్ చేస్తున్న కీలక సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవబోతున్నాయని టాక్ నడుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఇందులో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాబి డియోల్ విలన్ గా నటిస్తుండగా, ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ‘హరిహర వీరమల్లు’ మూవీ ప్రొడక్షన్ కు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. దాని ప్రకారం మేకర్స్ ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే సినిమాలోని మచిలీపట్నం పోర్ట్ సీక్వెన్స్ ని ఇరాన్ లో పూర్తి చేశారట. అలాగే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)లోని మరో కీలక సన్నివేశం టైగర్ సీక్వెన్స్ వీఎఫ్ఎక్స్ వర్క్ కెనడాలో, కుస్తీ సీక్వెన్స్ వీఎఫ్ఎక్స్ ను బెంగళూరులో, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ వీఎఫ్ఎక్స్ ని హైదరాబాద్ లో కంప్లీట్ చేశారట. అలాగే ఈ కుస్తీ సీన్ కోసం బిగ్ సెట్ వేసి కంప్లీట్ చేశారని తెలుస్తోంది.
ఇలా ఒక్క సినిమా కోసం ఇన్ని ప్రాంతాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వీఎఫ్ఎక్స్ పనులు పెట్టుకున్నారంటే, ఆ సన్నివేశాలు సినిమాలో ఎంత కీలకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కాబోతోందని తెలుస్తోంది. ఇక డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది మార్చ్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దానికిదే ప్రత్యేక కారణమని తెలుస్తోంది.
గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన చివరి భాగం షూటింగ్ ను ఏపీలో చిత్రీకరించారు. అయితే ఇంకా మూవీకి సంబంధించి ఐదు రోజుల షూటింగ్ మిగిలి ఉండగా, ‘హరిహర వీరమల్లు’ సినిమాలో మనోజ్ పరమహంస పాత్ర కీలకంగా మారబోతుందని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన సినిమాలో ఉండాలని మేకర్స్ ని కోరినట్టు సమాచారం.
మొత్తానికి పలు కారణాల వల్ల గత ఏడాది డిసెంబర్ నుంచి వాయిదా పడిన ఈ సినిమా మార్చి 28 నుంచి థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఇప్పటికే మేకర్స్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీ లో పవన్ కళ్యాణ్ పాడిన పాటను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ‘మాట వినరా’ అనే ఈ ఫస్ట్ సింగిల్ వాయిదా పడగా, నిన్న ఈ సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియో వెర్షన్ లీక్ అయ్యి నిర్మాతలకు షాక్ ఇచ్చింది.