Sankranti Special Trains 2025: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్లే నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పలు ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగానే విశాఖపట్నం నుంచి పార్వతీపురం వరకు ప్రత్యేకంగా రైలు నడపనున్నట్లు తెలిపింది. ఈ రైలుకు సంబంధించి పూర్తి వివరాలను విశాఖపట్నం జంక్షన్ అధికారులు తాజాగా వెల్లడించారు.
9 స్టేషన్లలో ఆగనున్న స్పెషల్ ట్రైన్
విశాఖ – పార్వతీపురం ప్రత్యేక రైలు జనవరి 10 నుంచి 20 వరకు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా 10 రోజుల పాటు ఈ రైలు ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చనుంది. ఇక ఈ స్పెషల్ రైలు మొత్తం 9 స్టేషన్లలో ఆగనున్నది. విశాఖలో బయల్దేరే రైలు సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుంది. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు ఎక్కే అవకాశం ఉంటుంది.
Read Also: సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల స్పెషల్ బస్సులు!
ఏ స్టేషన్లకు ఎప్పుడు చేరుకుంటుందంటే?
విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురం నుంచి 12.45 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ నుంచి 10 గంటలకు బయల్దేరే రైలు 10.15 గంటలకు సింహాచలం చేరుకుంటుంది. అక్కడి 1 నిమిషం పాటు ఆగుతుంది. అక్కడి నుంచి 10.25 గంటలకు పెందుర్తి స్టేషన్ కు చేరుకుంది. అక్కడ 1 నిమిషం పాటు ఆగుతుంది. అక్కడి నుంచి 10.33 వరకు కొత్త వసలకు చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాల పాటు ఆగుతుంది. అక్కడి నుంచి 10.58కి విజయనగరం చేరుకుంటుంది. అక్కడ కూడా 2 నిమిషాల పాటు ఆగుతుంది. అక్కడి నుంచి 11.20 నిమిషాలకు గజపతినగరం చేరుకుంటుంది. అక్కడి 1 నిమిషం పాటు ఆగుతుంది. అక్కడి నుంచి 11.30 గంటలకు కోమటిపల్లికి చేరుకుంటుంది. అక్కడ 1 నిమిషం పాటు ఆగుతుంది. అక్కడి నుంచి డొంకినవలస స్టేషన్ కు 11.40 గంటలకు చేరుకుంటుంది. అక్కడ కూడా 1 నిమిషం పాటు హాల్టింగ్ తీసుకుంటుంది. అక్కడి నుంచి 11.53 గంటలకు బొబ్బిలి చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాల పాటు రైలు ఆగుతుంది. అక్కడి నుంచి 12.05 గంటలకు సీతానగరం చేరుకుంటుంది. అక్కడ 1 నిమిషం పాటు రైలు ఆగుతుంది. అక్కి నుంచి 12.20 గంటలకు పార్వతీపురం స్టేషన్ కు చేరుకుంటుంది.
Read Also:తెలుగు రాష్ట్రాల నుంచి కాశ్మీర్‌కు రైళ్లు? ఏయే నగరాల మీద నుంచంటే…
విశాఖ- పార్వతీపురం స్పెషల్ రైలు తిరుగు ప్రయాణం ఎప్పుడంటే?
విశాఖ – పార్వతీపురం ప్రత్యేక రైలు 12.45 గంటలకు పార్వతీపురం నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. మళ్లీ సేమ్ స్టేషన్లలో 1 లేదా 2 నిమిషాల పాటు హాల్టింగ్ తీసుకుంటూ సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సంక్రాంతి సందర్భంగా 10 రోజుల పాటు తన సర్వీసులను కొనసాగించనుంది.
Read Also: శబరిమల ప్రత్యేక రైళ్లు రద్దు.. సౌత్ సెంట్రల్ రైల్వే షాకింగ్ డెసిషన్!