2026 Sankranthi:ఈ ఏడాది సంక్రాంతి పండుగ అలా ముగిసిందో లేదో అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఎవరెవరు దిగబోతున్నారు? అనే వార్తలు అటు అభిమానుల నుంచీ కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్ ‘, వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రెండు రోజుల తేడాతో థియేటర్లలోకి వచ్చిన విషయాలు తెలిసిందే. అయితే అన్ని సినిమాలు కూడా సో సో గానే ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్భం కనిపించలేదు.
వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి మూవీ ఫిక్స్..
ఇక దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి కోసం అభిమానులు అప్పుడే ఎదురుచూడడం మొదలుపెట్టారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది సంక్రాంతికి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలు సీటు కన్ఫామ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచేది ఎవరో? ఇప్పుడు చూద్దాం. 2026 సంక్రాంతికి ఇంకా ఏ సినిమా అధికారికంగా ప్రకటించక పోయినా.. ఇద్దరు హీరోలు మాత్రం పక్కాగా పోటీ పడబోతున్నారని సమాచారం. అందులో 2026 సంక్రాంతికి చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ ఇద్దరూ కూడా పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులోపు విడుదలవుతుందని సమాచారం. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odala) తో సినిమా చేయాల్సి ఉన్నా..అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అనిల్ స్వయంగా చిరంజీవితో కథ ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు డిస్కషన్ కూడా జరుగుతోందట. ఒకసారి ఫైనల్ అయితే సినిమా మొదలు పెట్టినట్లే అని ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో కూడా అనిల్ తెలిపారు .అంతేకాదు మళ్ళీ పండక్కి సినిమా తీసుకొస్తాను అయితే తనకు కేవలం 4 నుంచి 5 నెలలు సమయం ఇస్తే చాలని, సినిమా సిద్ధం అయిపోతుందని తెలిపారు.
సిద్ధమవుతున్న వెంకటేష్..
ఇక దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా ఉండబోతుందని, అందరూ అప్పుడే కన్ఫామ్ చేసేస్తున్నారు. ఇకపోతే 2026 సంక్రాంతికి కూడా వెంకటేష్ మళ్లీ వస్తాడని సమాచారం. 2024 సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వచ్చినా.. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల మళ్ళీ సంక్రాంతికి వచ్చి పర్వాలేదు అనిపించుకున్నారు.ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా లేదు. కానీ నాలుగు కథలపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అయితే వాటిల్లో ఏది ముందు అయితే దానిని వచ్చే సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్, వైజయంతి మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సినిమాలు చేయాలని వెంకటేష్ తెలిపారు.
నాగ్ కూడా పోటీ పడతారా..?
ఇకపోతే అనధికారికంగా సంక్రాంతి బరిలో వచ్చే ఏడాది చిరంజీవి , వెంకటేష్ సినిమాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంకో సంక్రాంతి హీరో నాగార్జున(Nagarjuna)2024 సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి హిట్టు కొట్టాడు. ఈ సంవత్సరం సంక్రాంతి మిస్ అయింది. కాబట్టి వచ్చే యేడాది కచ్చితంగా ఆయన సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరి ఆ సమయానికి ఎవరు సంక్రాంతి బరిలో పోటీగా నిలుస్తారో చూడాలి.