Chandrababu Naidu: సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.
ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చార్జిషీట్ దాఖలు చేసినందున… బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. 2023 నవంబర్ లో ఏపీ హైకోర్టు చంద్రబాబు కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది.
Also Read: KTR: సుప్రీంలో కేటీఆర్‌కు బిగ్ షాక్.. ‘‘కావాలంటే KTRను అరెస్ట్ చేసుకోండి..’’
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్ లొకేటరి అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక రిపోర్టర్ అయిన బాల గంగాదర్ తిలక్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎవరు..? దీనికి మీకేం సంబంధం..? పిల్ దాఖలు చేయడానికి ఉన్నత అర్హత ఏంటి..? అని నిలదీసింది. బెయిల్ మ్యాటర్‌లో మీరు ఎలా పిటిషన్ వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఫైర్ అయ్యింది. మరో ఇది రిపీట్ అయితే బాగుండదని రిపోర్టర్‌ను ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ ను డిస్మిస్ చేసింది.