BigTV English

Nayanthara:సక్సెస్ వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేసిన నయనతార..!

Nayanthara:సక్సెస్ వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేసిన నయనతార..!

Nayanthara:లేడీ సూపర్ స్టార్ అనే పేరు వినగానే అందరికీ సౌత్ హీరోయిన్ నయనతార (Nayanthara)నే గుర్తుకొస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని, తల్లయినా తరగని అందంతో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.అలా ప్రస్తుతం నయనతార 8 సినిమాల్లో నటిస్తోంది. ఈ 8 సినిమాల్లో నాలుగు సినిమాలు ఈ ఏడాది వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే గత ఏడాది నయనతార ఒక్క సినిమాతో కూడా మన ముందుకు రాలేదు. కానీ ఇయర్ ఎండింగ్ లో నయనతార బియాండ్ ది ఫేయిరీ టేల్ డాక్యుమెంటరీ కి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ వివాదం ఇప్పటికి కూడా సర్దుమనగలేదు.


బిజినెస్ పరంగా దూసుకుపోతున్న నయనతార..

ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నయనతార తన సక్సెస్ కి గల కారణాలు ఏంటి అనేది బయట పెట్టింది.మరి ఇంతకీ నయనతార సక్సెస్ సీక్రెట్ ఏంటి..?ఆమె చెప్పిన క్వాలిటీస్ ఏంటో? ఇప్పుడు చూద్దాం..నయనతార కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే.. కొన్ని సొంతంగా కూడా బిజినెస్ లు చేస్తూ ఉంటుంది.అలా నయనతార గత ఏడాది ఫెమి 9 శానిటరీ నాప్కిన్ అనే సంస్థని స్థాపించింది. అయితే ఈ సంస్థ స్థాపించి సంవత్సరం అవ్వడంతో దీనికి సంబంధించి ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమం మధురైలో జరగగా ఈ కార్యక్రమానికి నయనతార (Nayanthara), విజ్ఞేష్ శివన్(Vighnesh Shivan)లు ఇద్దరు వచ్చారు.


అవి రెండూ ఉంటే జీవితంలో సక్సెస్ అయినట్టే..

ఇక ఈ కార్యక్రమంలో నయనతార తన సక్సెస్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగి విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరిలో ఈ రెండు విషయాలు తప్పక ఉండాలి. ఈ రెండు క్వాలిటీస్ మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. వదులుకోకూడదు. ఇక ఆ రెండు క్వాలిటీస్ ఏంటంటే .. ఒకటి ఆత్మగౌరవం, రెండోది ఆత్మవిశ్వాసం. ఈ రెండు గనుక ప్రతి ఒక్కరిలో ఉంటే ఏదైనా సాధించగలరు. నా లైఫ్ లో నేను ఈ రెండు విషయాలను మాత్రమే గట్టిగా నమ్ముతాను. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మన ఆత్మ గౌరవాన్ని వదులుకోకూడదు. ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటే మనల్ని ఎవరు విమర్శించలేరు. మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే నిజాయితీగా ఉండడంతో పాటు ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోకూడదు. నిజాయితీగా ఉండాలి. నీచమైన మాటలను, చెప్పుడు మాటలను అస్సలు పట్టించుకోకూడదు. నిజాయితీగా మన పని మనం చేసుకోవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉండే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఈ రెండు క్వాలిటీస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి అంటూ నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విమర్శలు వచ్చినా పట్టించుకోదు.

అలాగే నయనతార జీవితం ఇంత సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది అంటే ఈ రెండే కారణాలు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే ఈ కార్యక్రమంలో ఏజెంట్లకు, పంపిణీదారులకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి అమ్మకాలు పెంచడంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి గిఫ్టులు కూడా ఇచ్చింది. అలా ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్ లలో కూడా దూసుకుపోతుంది.ఇక నయనతారని చాలామంది బిజినెస్ మైండ్ ఉన్న హీరోయిన్ అంటారు. ఎందుకంటే ఈమె డబ్బుల విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు.ఒక సినిమాకి రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు ఫిక్స్ చేస్తే , ఆ సినిమా ప్లాఫ్ అయినా సరే రూ.10కోట్లు కచ్చితంగా ఇవ్వాలని అంటుందట. అలాగే తన పెళ్లికి సంబంధించిన వీడియోలను డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ కి అమ్ముకున్న సమయంలో నయనతారపై చాలా విమర్శలు వచ్చాయి. నయనతార డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది అని , డబ్బు కోసం పెళ్లి వీడియోని కూడా అమ్మేసుకుంది అంటూ విమర్శలు చేశారు. కానీ నయనతార వాటిని పట్టించుకోదు. ఇక నయనతార చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. అంటే యంగ్ హీరోయిన్ల కంటే ఈ హీరోయిన్ ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×