Hair Fall Reasons: జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది. ఇందుకు గల కారణాలు. మీ జుట్టు వేగంగా రాలిపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారా ? మీరు కూడా బట్టతల బారిన పడతారని భయపడుతున్నారా? సమాధానం అవును అయితే, మీరు సమస్యకు కారణాలను తెలుసుకోవాలి. అంతే కాకుండా ఇందుకు పరిష్కారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మూల కారణాన్ని తెలుసుకోండి:
జుట్టు రాలడానికి, బట్టతల రావడానికి చాలా కారణాలున్నాయి. బట్టతల రావడానికి ఒక కారణం అలోపేసియా అరియాటా కూడా కావచ్చు. ఇందులో జుట్టు అకస్మాత్తుగా రాలడం మొదలవుతుంది. అంతే కాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాగాలలో బట్టతల ప్రారంభమవుతుంది. ఇదే కాకుండా పోషకాహార లోపం, జుట్టు మూలాలకు ఇన్ఫెక్షన్, థైరాయిడ్, మెనోపాజ్, హైపోథైరాయిడిజం, హార్మోన్ల మార్పులు వంటి అనేక కారణాలు ఉన్నాయి.
90 శాతం మంది పురుషులలో జుట్టు రాలడం హార్మోన్ల కారణంగామాత్రమే జరుగుతుంతి . ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ పురుషులలో బట్టతలకి కారణమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు రెండూ జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. ఈస్ట్రోజెన్ మహిళల్లో జుట్టు రాలే సమస్యను పెంచుతుంది. గర్భధారణ సమయంలో చాలా జుట్టు రాలడానికి ఇదే కారణం.
పరిష్కారం:
సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంటుంది. మీ జుట్టు తిరిగి పెరగడం అనేది జుట్టు రాలడానికి గల కారణం, జుట్టు రాలడానికి గల వ్యవధి, జుట్టు యొక్క ఆరోగ్యం, మీ పోషణ , ఆరోగ్యం మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. సకాలంలో సమస్యను అర్థం చేసుకుని దాని పరిష్కారానికి కృషి చేయడం మంచిది. అవసరమైతే వైద్య సలహా కూడా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
మసాజ్ మేలు:
మసాజ్ మీ సమస్యకు పరిష్కారం కావచ్చు. స్కాల్ప్ మసాజ్ జుట్టు కుదుళ్లకు పోషణ, ఆక్సిజన్ అందించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మసాజ్ ప్రారంభించిన 24 వారాల తర్వాత జుట్టు మందంలో తేడా ఉన్నట్లు ఒక అధ్యయనంలో రుజువైంది. మీరు ఐదు నుండి పది నిమిషాల పాటు కొబ్బరి లేదా ఆముదంతో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
కొల్లాజెన్ బేస్ ఉత్పత్తుల ఉపయోగం:
హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు, వాటిలో ఉపయోగించే పదార్థాలను తప్పకుండా గమనించండి. షాంపూ, కండీషనర్, హెయిర్ సీరమ్ తీసుకునేటప్పుడు వాటిలో కొల్లాజెన్ ఉండేలా చూసుకోవాలి. కొల్లాజిన్ ఉత్పత్తులను వాడటం వల్ల జుట్టుకు కావాల్సిన పోషణ లభిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యను ఇది దూరం చేస్తుంది.
Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. ఇలా చేయండి !
పోషకాహారం:
మీ ఆహారం కూడా సమస్యను తగ్గించడంలో పాత్ర పోషిస్తుందని తెలుసుకోండి. మీ ఆహారంలో విటమిన్ ఎ తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఇది సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది. దీని కోసం మీరు క్యారెట్, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలు, గుడ్డు, పెరుగు, కాడ్ లివర్ ఆయిల్ మొదలైన వాటిని తీసుకోవచ్చు. విటమిన్ బి కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి పని చేస్తుంది. ఇది మన తలకు పోషణను అందిస్తుంది. ఇందుకోసం తృణధాన్యాలు, బాదం, మాంసం, సీ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మొదలైనవి అవసరం. విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం, మీ ఆహారంలో స్ట్రాబెర్రీలు, నల్ల మిరియాలు, సిట్రస్ పండ్లను చేర్చండి. దీని తర్వాత విటమిన్ డి వంతు. దీని లోపం అలోపేసియాకు కారణమవుతుంది. కొవ్వు గల చేపలు, కాడ్ లివర్ ఆయిల్, పుట్టగొడుగులు, బలవర్ధకమైన ఆహారాలు, సూర్యకాంతి నుండి దీనిని పొందవచ్చు.