తిరుమతిలో టోకెన్ గత ప్రభుత్వం తెచ్చిందని సీఎం అంటున్నారని.. అలాంటపుడు ఆ టోకెన్ సిస్టంను ఎందుకు తీసేయలేదన్న రోజా విమర్శలకు.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రోజా తిరుమలలో టోకెన్స్ అమ్ముకునేందుకే తరచుగా దర్శనాలకు వచ్చేవారని.. టోకెన్స్ అమ్ముకొని బెంజ్ కారు కొన్నారని ఆరోపించారు. ‘తైతక్కలాడుకుండూ రాజకీయాల్లోకి వచ్చావు.. ప్రతిదానికి తగుదునమ్మా అంటూ మాట్లాడతావు’ అని జేసీ ఫైర్ అయ్యారు. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వంద లాది మందిని వెంట తీసుకెళ్లేదని దుయ్యబట్టారు. రోజా నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. చెక్ బౌన్స్ కేసులు అనంతపురం కోర్టులో ఉన్నాయన్న సంగతి మర్టిపోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటన.. బాధితులకు నష్టపరిహారం అందించిన టీటీడీ
చంద్రబాబు పుణ్యమాఅని రాజకీయాల్లోకి వచ్చావు.. నోరుంది కదా అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తప్పంతా చంద్రబాబుదే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము అనేక ఇబ్బందులు పడ్డామని, కాని చంద్రబాబు మాత్రం వాళ్లని గాలికి వదిలేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజా ఇది డ్రామా కంపెనీ కాదు.. అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్‌ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయాలు అయిన సంగతి తెలిసిందే..