Cameos in HIT 3 :హిట్ (Hit) ఫ్రాంచైజీలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu). హిట్(Hit ) సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన శైలేష్ కొలను.. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదట విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత హిట్ 2 తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో అడివి శేషు (Adivi Shesh) హీరోగా నటించారు. ఇక ఇప్పుడు హిట్ 3 సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే హిట్ , హిట్ 2 సినిమాలు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ జోనర్ లో తెరకెక్కాయి. అయితే హిట్ 3 లో మాత్రం హీరో అసలైన వైలెంట్ సృష్టించారని చెప్పవచ్చు. పైగా నానిని ఇప్పటివరకు ఏ సినిమాలో చూడని విధంగా అత్యంత క్రూరంగా చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో నానిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా లవర్ బాయ్ ని కాస్త క్రూరుడిగా మార్చేశారు కదరా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
క్యామియోలతోనే పిచ్చెక్కించారు..
ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఈరోజు నాని నటించిన హిట్ 3 సినిమా విడుదలైంది. ఇందులో కార్తీ (Karti) ఉన్నాడు అంటూ గతంలో గాసిప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నిజమయింది. అయితే ఈ సినిమాలో కార్తీ సన్నివేశాలపై అభిమానులలో చాలా అంచనాలు ఉండేవి. కానీ ఒక్క చిన్న సీన్లోనే ఆయన కనిపించాడు. పైగా అభిమానుల అంచనాలన్నీ కూడా గాల్లోనే కలిసిపోయాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శేషు పాత్ర మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఇలా క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఊహించని కామెడీ పాత్రలు సినిమా చూసే ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తాయని చెప్పవచ్చు. కేవలం కామెడీ పాత్రలతోనే సినిమాను పిచ్చెక్కించారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే హిట్ -4 లో కార్తి హీరోగా నటిస్తున్నాడు అంటూ వార్తలు రాగా, ఆయన హిట్ 4 లో ఏసీపీ వీరప్పన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే హిట్ 3 తోనే క్లోజ్ చేయకుండా హిట్ 4 కూడా ఉంటుందని చెప్పి అందులో కార్తీ నటించబోతున్నాడు అని ప్రకటించారు మేకర్స్. మొత్తానికి అయితే ఒక సినిమాతో నెక్స్ట్ సినిమాలో హీరోలు ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే రివీల్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీని మరింత పెంచేసారని చెప్పవచ్చు.