BigTV English

India Jams Pak Aircraft: పాక్ యుద్ధ విమానాలకు చెక్ పెట్టిన భారత్.. కొత్త టెక్నాలజీతో పాక్ పైలట్ల కళ్లకు గంతలే

India Jams Pak Aircraft: పాక్ యుద్ధ విమానాలకు చెక్ పెట్టిన భారత్.. కొత్త టెక్నాలజీతో పాక్ పైలట్ల కళ్లకు గంతలే

India Jams Pak Military Aircraft| ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరు దేశాలు తమ సైన్యాలను రెడీ చేసుకుంటున్నాయి. వైమానికి, నావికా దళాలు సైతం డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. భారత్ దాడి చేస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి, ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగినట్లు సరిహద్దుల వద్ద ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలను మోహరించాయి. అయితే ఇండియా, పాకిస్తాన్ మధ్య వాయు దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు భారత్ కొత్త టెక్నాలజీని ప్రయోగించబోతోందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.


విమానాలు నడిపే పైలట్లు అందులోని నావిగేషన్ (దారి చూపే మ్యాప్) ప్రకారం ముందుకు సాగుతారు. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ద విమానాలకు ఈ నావిగేషన్ సిస్టం కట్ చేయడానికి భారత దేశం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్ఎస్ఎస్) అనే అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ప్రయోగిస్తోంది. ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే.. భారత భూభాగం, ఆకాశ మార్గంలోకి రాగానే పాక్ యుద్ధ విమానాల్లో నావిగేషన్ సిస్టం పనిచేయదు. దీంతో విమానం నడిపే పైలట్ కు ఏ దిశలో ప్రయాణించాలో తెలియక.. దారి తప్పే అవకాశం ఉంది. దీంతో వారు అనుకున్న టార్గెట్లపై దాడి చేయలేరు.

మీడియా నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో జిపిఎస్ తో పాటు గ్లో నాస్ (GLONASS), బెయిడవు(Beidou) లాంటి నావిగేషన్ సిస్టం ఉపయోగించబడుతోంది. వీటితో పాటు మల్లిపుల్ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ కూడా పాక్ పైలట్లు వినియోగిస్తున్నారు. ఇలాంటి అన్ని నావిగేషన్ సిస్టంలకు భారత్ కొత్త టెక్నాలజీ చెక్ పెట్టగలదని సమాచారం.


Also Read: బాబ్రీ మసీదు మళ్లీ నిర్మిస్తాం.. యుద్ధ వాతావరణంలో పాక్ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం.. ఇండియాలోకి పాకిస్తాన్ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు ఈ నిషేధం కొనసగుతుందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్యాసింజర్ ఎయిర్ లైన్స్, మిలిటరీ ఫ్లైట్స్ కు నోటం (నోటీస్ టు ఎయిర్ మెన్) జారీ చేసింది. అన్ని పాక్ సంబంధిత విమానాలు భారత భూభాగంలోకి రాకూడదని ఆ నోటీసులో తెలిపింది. ఈ క్రమంలో పాక్ విమానాలు ఉపయోగించే నావిగేషన్ సిస్టం నిర్వీర్యం చేయాలని జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీ కలిగిన జామర్లు ఉపయోగంలోకి తెచ్చింది.

ఈ జామర్లు పాక్ విమాన పైలట్లకు ఆకాశ మార్గంలో దారి తెలియకుండా చేసేందుకు కచ్చితంగా పనిచేస్తాయని తద్వారా యుద్ధ విమానాల నుంచి మిసైల్ ప్రయోగిస్తే.. దానికి టార్గెట్ ఉండదని తెలిపింది.

ప్యాసింజర్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు
ఇండియా ఈ జామర్లు ప్రయోగించిన కారణంగా భారతదేశం మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే పాక్ విమాన పైలట్లు, ఎయిర్ లైన్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత భూభాగం పై నుంచి శ్రీలంక, చైనా, మలేసియా, ఇండోనేషియా లాంటి దేశాలకు ప్రయాణించే పాకిస్తాన్ విమానాలు ఇకపై భారత్ చుట్టూ తిరిగి ఎక్కువ దూరం ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది.

దీని వల్ల పాకిస్తాన్ విమానాలకు అదనంగా ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణ సమయం కూడా ఒకటి నుంచి రెండు గంటలు అదనంగా మారుతుంది.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×