RobinHood: నితిన్ ((Nithin)) హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28, 2025న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మాణం వహించారు.ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. వెంకీ కుడుముల గతంలో నితిన్‌కు “భీష్మ” వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కావడంతో.. రాబిన్ హుడ్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే.. ఈ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ సాంగ్.. థియేటర్లోను సర్ప్రైజ్ ఇచ్చింది.
అదిదా సర్ప్రైజ్ కాంట్రవర్శీ
రాబిన్‌హుడ్ సినిమా విడుదలకు ముందు విడుదలైన ‘అదిదా సర్‌ప్రైజు’ పాట ప్రేక్షకులలో మంచి స్పందన పొందింది. ఈ ప్రత్యేక గీతంలో కేతిక శర్మ తన గ్లామర్ మరియు ఎనర్జిటిక్ డాన్స్‌తో ఆకట్టుకుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను నీతి మోహన్ మరియు అనురాగ్ కులకర్ణి ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అయితే.. ఈ పాట విడుదలైన తర్వాత, అందులోని డ్యాన్స్ స్టెప్స్ పై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ పై విమర్శలు గుప్పించారు. ఇవేం స్టెప్పులు అంటు మండిపడ్డారు. డాకు మహారాజ్ దబిడి దిబిడి సాంగ్ విషయంలోను శేఖర్ మాస్టర్ విమర్శల పాలయ్యారు. అంతకుముందు మిస్టర్ బచ్చన్ సాంగ్ కూడా కాంట్రవర్శీ అయింది. వాటికి మించి అన్నట్టు అదిదా సాంగ్‌లో కేతిక స్టెప్పులు అసభ్యంగా ఉన్నాయని అన్నారు. అయితే.. ఈ వివాదంపై నితిన్ మాట్లాడుతూ, ఆ పాట షూటింగ్‌లో తాను పాల్గొనలేదని, వివాదం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. కానీ దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది. దీంతో.. కాంట్రవర్శీ స్టెప్ పై సెన్సార్ కట్ పడింది.
ఇక్కడ కట్.. కానీ అక్కడ ఉంది!
థియేటర్ వెర్షన్‌లో అదిదా సర్ప్రైజ్ పాట వచ్చినప్పుడు అందులో వివాదానికి కారణమైన డాన్స్ స్టెప్స్ కనిపించలేదు. దీంతో ఆ హూక్‌స్టెప్ ట్రిమ్ చేశారని సినిమా చూసిన వారు చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రమోషన్స్‌లో మేకర్స్‌ను అడగ్గా.. థియేటర్లో సర్ప్పైజ్ ఇస్తామని అన్నారు. అన్నట్టే.. వివాదాస్పద డ్యాన్స్ స్టెప్‌ను కట్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే? ఈ స్టెప్పులు ఓవర్సీస్‌లో మాత్రం యాజ్ టీజ్‌గా ఉన్నాయని అంటున్నారు. ఈ పాటలోని అసభ్యంగా ఉన్నాయనే హుక్ స్టెప్పులు ఓవర్సీస్ వెర్షన్‌లో తొలగించలేదట. కేవలం భారతీయ థియేటర్లలో ప్రదర్శించే వెర్షన్ నుంచి మాత్రమే మేకర్స్ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఓవర్సీస్‌లో ఎందుకు ట్రిమ్ చేయలేదు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఓవర్సీస్ ఆడియెన్స్‌కు మాత్రం కేతిక గ్లామర్ ట్రీట్ స్పెషల్‌గా నిలవనుందనే చెప్పాలి. మొత్తంగా.. తెలుగులో మాత్రం అదిదా సర్ప్రైజ్ అభ్యంతకర స్టెప్స్ విషయంలో మేకర్స్ రిస్క్ తీసుకోలేదనే చెప్పాలి.