Comedian Ali: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది పై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే.. బెట్టింగ్ కేసు వ్యవహారంలో యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నాడు. ఎంత పెద్ద స్టార్ అయిన సరే.. ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా కమెడీయన్ అలీ పై షాకింగ్స్ కామెంట్స్ చేశాడు నా అన్వేష్.
అలీ బిర్యానీ పేరుతో మోసం
బెట్టింగ్స్ యాప్స్ విషయంలో కమెడియన్ అలీని నా అన్వేష్ టార్గెట్ చేశాడు. అలీ ఆయన భార్య జుబేదా కలిసి యూట్యూబ్ ఛానల్‌లో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారని నా అన్వేష్ సెటైర్స్ వేశాడు. ఒక బిర్యానీ వీడియోలో యాప్స్‌ని ప్రమోట్ చేశారని అన్నారు. రూ. పది వేల ఖర్చుతో పేదలకు బిర్యానీ పంచి వ్యూస్ ద్వారా యూట్యూబ్‌లో పది లక్షలు సంపాదించారు అని అన్నారు. వేల కోట్ల ఆస్తి ఉండి ఇలాంటి దారుణాలకు ఒడిగడతావా అని మండి పడ్డాడు. రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం కరక్టేనా? అల్లా ఎక్కడైనా ఇలా చేయమని చెప్పారా? అని ప్రశ్నించారు. మీ వల్ల ఎంతోమంది నమ్మి తమ జీవితాలను పోగొట్టుకున్నారని.. అన్నారు. అయితే.. ఎప్పుడు బూతుుఎ మిక్స్ చేసి వీడియోలు చేసే నా అన్వేష్.. అలీ గురించి మాట్లాడిన సందర్భంలో పెద్దగా బూతులు మాట్లాడలేదు. కానీ ఈసారి అలీని టార్గెట్ చేశాడనే చెప్పాలి. మరి అలీ దీనిపైన స్పందిస్తాడా? లేదా అనేది చూడాలి.
తెలుగు సెలబ్రిటీస్ పై సీరియస్
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న 11 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించారు. ఈ లిస్ట్‌లో రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి వారి పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి.. ఇప్పటికకే రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియా, యాంకర్ శ్యామల పొలుసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో అలీని కూడా చేర్చాడు నా అన్వేష్. మరి అలీ వ్యవహారం ఎక్కిడి వరకు వెళ్తుందో చూడాలి.