OTT Movie : ఏలియన్స్ స్టోరీలతో చాలా సినిమాలే వచ్చాయి. వీటి గురించి భూమి మీద రకరకాల స్టోరీలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వీటి గురించి అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏలియన్స్ స్టోరీలతో దిమ్మ తిరిగే సినిమాలు వస్తున్నాయి. 1985 లోనే అందరూ ఆశ్చర్యపడే విధంగా ఒక ఏలియన్ మూవీని తెరకెక్కించారు. అయితే ఇందులో ఆ ఏలియన్స్ వాంపైర్ లా రక్తాన్ని పీల్చి మనుషుల్ని చంపుతుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘లైఫ్‌ఫోర్స్’ (Life Force). 1985 లో రిలీజ్ అయిన ఈ మూవీకి టోబ్ హూపర్ దర్శకత్వం వహించారు. ఇందులో స్టీవ్ రైల్స్‌బ్యాక్, పీటర్ ఫిర్త్, ఫ్రాంక్ ఫెన్లే, మథిల్డా మే నటించారు. 1976 లో కోలిన్ విల్సన్ రచించిన ‘ది స్పేస్ వాంపైర్స్’నవల ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీలో స్పేస్ నుంచి ముగ్గురు గ్రహాంతర వాసులను భూమి మీదకు తీసుకొస్తారు. తరువాత భూమి మీద పరిస్తితి చాలా క్రిటికల్ గా మారుతుంది. బాక్సాఫీస్ వద్ద ఇది ఈ మూవీ ఒక కల్ట్ ఫిల్మ్‌గా మారింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అంతరిక్ష పరిశోధనల కోసం ఒక మిషన్ ను స్పేస్ లోకి పంపిస్తారు శాస్త్రవేత్తలు. స్పేస్ లోకి వెళ్ళినాక, అంతరిక్ష నౌకలోని సిబ్బంది ఒకచోట వింతైన భారీ నౌకను కనుగొంటారు. దాని లోపల మూడు మానవ రూపాల్లో ఉన్న జీవులను చూస్తారు. అంత పెద్ద షిప్ లో ఎవరూ ఉండరు. అయితే ఆ ఏలియన్స్ ప్రాణాలతో ఉంటాయి. కాకపోతే నిద్రాణస్థితిలో, ఒక గాజు పెట్టెలో భద్రపరచి ఉంటాయి. వీటితో పాటు వేలాది గబ్బిలం లాంటి జీవుల మృతదేహాలు కూడా అక్కడ పడి ఉంటాయి. అంతరిక్ష సిబ్బంది ఈ మూడు జీవులను భూమికి తీసుకువస్తారు. భూమిపైకి చేరిన తర్వాత, ఈ జీవులు శక్తివంతమైన స్పేస్ వాంపైర్లు అని తెలుస్తుంది. వారు మానవుల శక్తిని పీల్చుకుంటూ, వారిని ఎండిపోయిన శవాలుగా మార్చేస్తారు. ఈ క్రమంలో బాధితులు కూడా వాంపైర్లుగా మారి, మిగతా వాళ్ళపై దాడి చేస్తుంటారు.
అందులో ఒక మహిళా వాంపైర్ అసాధారణ శక్తులతో, ఆకర్షణీయమైన రూపంతో కనిపిస్తుంది. ఆమె వివిధ రూపాలు ధరించి మనుషులను చంపుతూ ఉంటుంది. ఆమె చుట్టూ స్టోరీ ఎక్కువగా తిరుగుతుంది.ఈ వాంపైర్లు చంపే విధానం చూస్తే, భూమిని నాశనం చేయడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. చివర్లో కార్ల్సెన్ అనే వ్యక్తి ఈ వాంపైర్లను ఆపడానికి ప్రయత్నిస్తాడు. మహిళా వాంపైర్ ను కార్ల్సెన్ ఒక లెడ్ లైన్డ్ కత్తితో చంపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ వాంపైర్లను మనుషులు అంతం చేస్తారా? వాటిని ఎవరు క్రియేట్ చేశారు? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాల్సిందే.