Bollywood : బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ ఇటీవలే కన్నుమూశారు. తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు. ముకుల్ మరణానికి గల అసలు కారణాలను ఆయన సోదరుడు రాహుల్ దేవ్ తాజాగా పంచుకున్నారు.. తన సోదరుడు మరణం గురించి టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్ ఓ పత్రికతో ఈ విషయాన్ని బయటకు చెప్పాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..?
తమ్ముడు అందుకే చనిపోయాడు..
రాహుల్ దేవ్ ఓ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తమ్ముడు అందరూ అనుకుంటున్నట్లు ముకుల్ డిప్రెషన్‌తో చనిపోలేదని, గత కొన్నేళ్లుగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే మరణానికి దారితీసిందన్నారు. ముకుల్ వారం రోజులకు పైగా ఐసీయూలో ఉన్నాడు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే అతడి అనారోగ్యానికి కారణమని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత పూర్తిగా తినడం మానేశాడు.. డిప్రషన్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులుగా ఒంటరిగా ఉన్నాడు. సినిమా ఆఫర్స్ ను కూడా వదులుకున్నాడు. అది గనుక చేసింటే ప్రాణాలతో ఉండేవాడు అని ఆయన సంచలన విషయాలను బయటపెట్టాడు..
అంతేకాదు.. మా తండ్రి మరణం మమ్మల్ని ఇంకాస్త క్రుంగదీసింది.. ఆ తర్వాత తల్లి మరణం, భార్యతో విడాకులు అతడిని మరింత కుంగదీసినట్లు వివరించారు. దాంతో ఎక్కువ సమయం ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడని.. ఆహారపు అలవాట్లు కూడా మారాయని అన్నారు. ఎవరూ అతడికి అండగా లేకపోవడం, తనని తాను పట్టించుకోవడం మానేశాడని అన్నారు. పేరెంట్స్ మరణం వల్ల అతన్ని పట్టించుకోలేదు. ఆయనను విమర్శిస్తున్నారు. కొంచెం కూడా మానవత్వం అనేది లేదా అని ఆయన అన్నారు.
ముకుల్ కెరీర్ విషయానికొస్తే..
మొదట సీరియల్ నటుడుగా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘జైహో’, ‘యమ్లా పగ్లా దీవానా’ లాంటి చిత్రాల్లో శక్తిమంతమైన పాత్రల తో సినీప్రియుల్ని మెప్పించారు. రవితేజ నటించిన ‘కృష్ణ’ సినిమా తో ప్రతినాయకుడి గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ‘అదుర్స్’, ‘సిద్ధం’, ‘నిప్పు’, ‘భాయ్’ తదితర సినిమాల్లో నటించారు.. ఆయన నటనకు మెచ్చి సినీ ప్రముఖులు ఎన్నో అవార్డులు అందించారు.. భౌతికంగా ఆయన లేకున్నా కూడా సినిమాలు ఆయనను కళ్ళ ముందు కనిపించేలా చేస్తున్నాయి.
రాహుల్ దేవ్..
ఈయన నటుడుగా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రం లో అభిమానులను మెప్పించిన బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్. విలన్‌గా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఫ్యాన్స్ ను మెప్పించారు. ఈయన చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేవ్ కుటుంబంలో వరుసగా మరణాలు జరిగాయి. తండ్రి, తమ్ముడు చనిపోయారు. ఇంట్లో వరుసగా అందరు చనిపోవడంతో రాహుల్ ను తీవ్రంగా భాధించింది. ప్రస్తుతం తన తమ్ముడు మరణం పై ఆయన చెప్పిన కొన్ని నిజాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.