OTT Movie : టెక్సాస్‌లోని ఐదుగురు యువకులు ఒక వ్యాన్‌లో ప్రయాణిస్తుంటారు. వాళ్ళ ప్రయాణం త్వరలోనే ఒక భయంకరమైన సంఘటనలతో నిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్మానుష్యమైన ఫార్మ్‌హౌస్‌లో చిక్కుకుంటారు. అక్కడ ముఖం మీద మాస్క్ లు ధరించిన భయంకరమైన కన్నిబల్ కుటుంబం నివశిస్తుంటుంది. ఈ విధ్వంసక కుటుంబం నుండి ఎవరైనా తప్పించుకుంటారా ? ఈ యువకులు అక్కడ ఎలా చిక్కుకున్నారు? ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1973లో టెక్సాస్‌లో మొదలవుతుంది. స్థానికంగా సమాధులు దోపిడీకి గురవుతున్నాయనే వార్తలు కలకలం సృష్టిస్తాయి. సాలీ హార్డెస్టీ, ఫ్రాంక్లిన్ వాళ్ళ తాత సమాధి సురక్షితంగా ఉందో లేదో చెక్ చేయడానికి, ముగ్గురు స్నేహితులు జెర్రీ, కిర్క్, పామ్ తో కలిసి ఒక వ్యాన్‌లో రోడ్ ట్రిప్‌కు బయలుదేరతారు. రహదారిపై వీళ్ళు ఒక విచిత్రమైన హిచ్‌హైకర్ కు లిఫ్ట్ ఇస్తారు. అతను వారి కుటుంబం గురించి, స్లాటర్‌హౌస్ గురించి వింతగా మాట్లాడతాడు. అంతే కాకుండా ఫ్రాంక్లిన్‌ను కత్తితో గాయపరుస్తాడు. భయపడిన ఈ గ్రూప్ అతన్ని వ్యాన్ నుండి తోసేస్తారు. కొంత దూరం వెళ్ళాక వీళ్ళంతా గ్యాస్ కోసం ఒక ఫ్యూయల్ స్టేషన్‌లో ఆగుతారు.
ఆ తర్వాత వీళ్ళు సాలీ, ఫ్రాంక్లిన్ పాత ఇంటికి వెళతారు. దగ్గరలోని ఒక వాటర్‌హోల్‌లో స్విమ్ చేయడానికి కిర్క్, పామ్ వెళతారు. కానీ దారిలో ఒక ఫార్మ్‌హౌస్‌ను చూస్తారు. అక్కడ ఒక కుటుంబం నివశిస్తుంటుంది. వీళ్ళంతా మనుషుల మాంసం తినే రాక్షస గుణానికి అలవాటుపడి ఉంటారు. సాలీ ఈ కుటుంబం చేతిలో చిక్కుకుంటుంది. వాళ్ళకు ఆహారంగా మారే సమయంలో, సాలీ తన బలం కూడదీసి తప్పించుకోవడానికి పోరాడుతుంది. అయితే ఆ తరువాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. చివరికి ఈ కుటుంబం కన్నిబలిస్టిక్ జీవనశైలికి ఎందుకు అలవాటుపడింది ? సాలీ, ఆమె స్నేహితులు ఈ భయంకర ఫార్మ్‌హౌస్ నుండి తప్పించుకోగలరా ? లేకపోతే కాన్నిబల్స్ కి భోజనంగా మారతారా? అనే విషయాలను ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాలసిందే.
Read Also : వర్షం పడితే అమ్మాయిల్ని చంపే సైకో … శవాలని కూడా వదలకుండా … ఇదెక్కడి అరాచకం మావా
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘The Texas Chain Saw Massacre’ 1974 లో వచ్చిన ఈ సినిమాకి టోబ్ హూపర్ దర్శకత్వం వహించారు. ఇందులో మెరిలిన్ బర్న్స్, అలెన్ డాన్జిగర్, పాల్ ఎ. పార్టైన్, విలియం వైల్,టెరి మెక్‌మిన్ వంటి నటులు నటించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.