BigTV English
Advertisement

Nithin – Chiranjeevi : నితిన్ – చిరంజీవి మధ్య ఉన్న రిలేషన్ ఇదే.. అస్సలు ఊహించి ఉండరు..!

Nithin – Chiranjeevi : నితిన్ – చిరంజీవి మధ్య ఉన్న రిలేషన్ ఇదే.. అస్సలు ఊహించి ఉండరు..!

Nithin – Chiranjeevi : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత వరుస హిట్ సినిమాలు ఆయనను పలకరించాయి. కెరియర్ మొదటి నుంచి సినిమాలో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు పొందాడు నితిన్. ఈమధ్య కొన్నేళ్లుగా నితిన్ కు హిట్ సినిమా కరువైంది. ఎలాగైనా ఈ సారి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవాలని సరికొత్తకథలతోప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాబిన్ హుడ్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కరోనా టైంలో శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు..ఇష్క్’ సినిమా టైంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం, ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లడం జరిగింది.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నితిన్ భార్య శాలినికి మెగాస్టార్ చిరంజీవికి రిలేషన్ ఉందని టాక్.. మరి రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నితిన్ అత్తమామలు, శాలిని తల్లిదండ్రులు సంపత్ కుమార్, షేక్ నూర్జహాన్ నాగర్, ఇద్దరు డాక్టర్లే. వీళ్లది ప్రేమ పెళ్లి. వీళ్ళు కర్నూల్లో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్ ను రన్ చేస్తున్నారు.. నితిన్ అత్తగారైన నూర్జహాన్ కు చిరంజీవికి మంచి అనుబంధం ఉందట. ఏంటి అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారు కదా అవునండి అది సాధ్యమే. చిరంజీవికి నితిన్ అత్తగారికి ఒక చక్కటి అనుబంధం అనేది ఉందని తెలుస్తుంది.

గతంలో 2008లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన సొంతంగా పార్టీని స్థాపించారు. ప్రజారాజ్యం అనే పార్టీని ఆయన స్థాపించి జనాలకు దగ్గరయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున కర్నూలు జిల్లా నియోజకవర్గం నుండి నాగర్ ను నిలబెట్టారు చిరంజీవి. కానీ నాగర్ ఓటమి పాలయ్యారు. తర్వాత ఈమె కూడా రాజకీయాలకు దూరమయ్యారని తెలుస్తుంది. రాజకీయంగా వాళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నా కానీ, నితిన్ అత్తమామలు చిరంజీవికి మంచి స్నేహితులయ్యారు. అలా వీళ్ళ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.


మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను విడి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఆయన విశ్వంభర అనే మూవీలో నటిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత తమ్ముడు అనే సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఆ సినిమాల్లో ఒక్క సినిమా అయినా నితిన్ కు భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×